దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా.. అతి కొంది సమయంలోనే.. దేశంలోనే అతిసంపన్న రాష్ట్రంగా బీహార్ అవతరించే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. ఇప్పటి వరకు అత్యంత పేద రాష్ట్రంగా పేరున్న బీహార్.. గిప్పుడు ఆ రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలున్నాయాంట. ఇక ఈ వార్తను వాళ్లు వీళ్లు చేప్పడం కాదు అధికారికంగా.. కేంద్ర ఖనిజాల శాఖ మంత్రి పార్లమెంట్లో కుండ బద్దలు కొట్టి చెప్పారు. దేశంలోని బంగారు నిల్వల్లో 44 శాతం బీహార్ లోని జాముయి జిల్లాలో, బంకాజిల్లాలోని కటారియా ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు. వీటిని గుర్తించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వ చేపట్టింది. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కరామతియాలో బంగారాన్ని వెలికితీస్తారని, ఇది జాముయికే కాకుండా యావత్ దేశానికి, రాష్ట్రానికి మేలు చేస్తుందని సోనో బ్లాక్ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక విషయంలోకి వెళ్తే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా.. బంగారం ధర ఎంత పెరుగుతందో పని గట్టుకోని చెప్పక్కర్లేదు. ఈ దేశం ఆ దేశం అని తేడాలు లేకుండా ప్రతి దేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని సార్లు తగ్గుముఖం పట్టినా ఓవరాల్ గా మాత్రం ఆల్ టైం హయ్యెస్ట్ ధరలను నమోదు చేశాయి. అయితే ఈ నేపథ్యంలో బంగారు నిల్వల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనదేశంలో బంగారు నిల్వలు ఉంటే ఈ ధరల ఎఫెక్ట్ ఇంతగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీహార్ రాష్ట్రంలో గతంలో బయటపడ్డ బంగారు గనుల తెరపైకి వచ్చాయి. ఇక ఈ సమయంలో భారత్ తో బయటపడ్డ ఓ బంగారు గనిని ఓపెన్ చేయాలని కొంతమంది సూచిస్తున్నారు.

ఇక బంగారం నిలువల వద్దకు వెళ్తే… బీహార్ రాష్ట్రంలోని జాముయి జిల్లాలోని సోనో బ్లాక్ ప్రాంతంలో.. కర్మతియా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ఇక ఆ సర్వేలో వెల్లడైన సమాచారం మేరకు.. బీహార్ రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్నాయని నిర్ధారించారు. జాముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, అందులో 27.6 టన్నుల ఖనిజాలు అధికంగా ఉన్నాయని సర్వే తెలిపింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు, సర్వేలో నిమగ్నమైన ఏజెన్సీ రాష్ట్ర గనులు, భూగర్భశాస్త్రశాఖ బంగారు నిక్షేపాల శోధన కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. “భారతదేశంలో అతిపెద్ద బంగారు నిల్వ”ను అన్వేషించడానికి కొత్త బిడ్ను బీహార్లోని గత నితీష్ కుమార్ ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్సభలో భారతదేశం యొక్క బంగారు నిల్వలో అత్యధిక వాటాను బీహార్ కలిగి ఉందని వెల్లడించారు. అయితే ఈ బంగారు గనుల్లో తవ్వకాలకు ఇంకా అనుమతులు లభించలేదు. ఒకవేళ ప్రభుత్వం ఇక్కడి బంగారాన్ని వెలికి తీయడం మొదలుపెడితే భారత ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు చేకూరుతుంది అంటున్నారు నిపుణులు. ఇక బీహార్ లో వచ్చే కొత్త ప్రభుత్వం ఈ గనుల విషయంలో ఒక యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే నిండుగా కనబడుతున్నాయి.

ఇక 2015 ఏప్రిల్ 1 భారతదేశంలో దాదాపు 500.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం అందుబాటులో ఉందని అంచనా వేశారు. ఇందులో 654.74 టన్నుల బంగారు లోహం ఉంది. ఈ మొత్తంలో, 222.885 మిలియన్ టన్నులు (44 శాతం) బీహార్ లోనే ఉన్నాయని.. ఇందులో 37.6 టన్నుల బంగారు లోహం ఉంది. ఇక్కడ మైనింగ్ ప్రారంభమైతే బీహార్ రాష్ట్రం.. బంగారు ఉత్పత్తికి కేంద్రంగా మారవచ్చు. మరి ఇక్కడ మైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారో వేచి చూడాలి.