Takaichi becomes Japan's new Prime Minister.. This is the political background

Japan New PM : ద్వీప దేశం జపాన్ (Japan) చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా జపాన్ లో నారీ శక్తి విజయం పొందింది. జపాన్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాయిచి ఎన్నికై జపాన్ చరిత్ర ఒక అధ్యయంగా మారింది.

ఇక విషయంలోకి వెళ్తే…

జపాన్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి (Prime Minister) గా సనే తకాయిచి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సనే తకాయిచితో కలిసి ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. భారత్, జపాన్ (India, Japan) మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతి, సుస్థిరత, శ్రేయస్సును నెలకొల్పడంలో ఇరు దేశాల బంధం అత్యంత కీలకమని ఆయన తన పోస్టులో అభిప్రాయపడ్డారు.

తకాయిచి జీవితం నేపథ్యం…

సనే తకైచి 1961 మార్చి 7 మార్చిన జపాన్ లోని నారాలో జన్మించారు. ఆమె తండ్రి, డైక్యూ తకైచి (Daikyu Takaichi) (1934–2013), టయోటాతో అనుబంధంగా ఉన్న ఆటోమోటివ్ సంస్థలో పనిచేశారు. ఆమె తల్లి, కజుకో తకైచి (1932–2018), నారా ప్రిఫెక్చురల్ పోలీస్‌ (Nara Prefectural Police) లో పనిచేశారు. తకైచి, కోబ్ విశ్వవిద్యాలయం (Kobe University) నుండి పట్టభద్రురాలైంది. ఆ తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు రచయిత్రి గా ఆ తర్వాత శాసనసభ్యురాలు, ప్రసారకురాలిగా పనిచేశారు. 1993లో ప్రతినిధుల సభకు స్వతంత్ర సభ్యురాలిగా ఎన్నికైన ఆమె 1996లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (Liberal Democratic Party) (LDP)లో చేరారు. మత్సుషితా ఇన్స్టిట్యూట్ (Matsushita Institute) నుండి స్పాన్సర్షిప్ తో, ఆమె 1987 లో డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉమెన్ పాట్ ష్రోడర్ వద్ద కాంగ్రెస్ ఫెలోగా పనిచేయడానికి యునైటెడ్ స్టేట్స్ (United States) కు వెళ్లింది. 1989 లో జపాన్ కు తిరిగి వచ్చిన తరువాత, ఆమె అమెరికన్ రాజకీయాల పరిజ్ఞానంతో శాసన విశ్లేషకురాలిగా పనిచేసింది మరియు తన అనుభవం ఆధారంగా పుస్తకాలు రాసింది. ఆమె మార్చి 1989 లో టీవీ అసహి యాంకర్ గా మారింది, రెన్హోతో కలిసి స్టేషన్ యొక్క “కొడావారి టీవీ ప్రీ-స్టేజ్” (Kodavari TV Pre-Stage) కార్యక్రమాన్ని నిర్వహించింది. అబే శిష్యురాలు అయిన తకైచి, అబే ప్రీమియర్‌షిప్ సమయంలో వివిధ పదవులను నిర్వహించారు. ముఖ్యంగా అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిగా.. ఆమె 2021లో LDP నాయకత్వ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటి చేశారు. కానీ రన్‌ ఆఫ్‌కు ముందే తొలగించబడి, మూడవ స్థానంలో నిలిచారు. ఇక 2022 నుండి 2024 వరకు, ఫ్యూమియో కిషిడా ప్రీమియర్‌షిప్ (Fumio Kishida Premiership) సమయంలో, ఆమె ఆర్థిక భద్రతా సహాయ మంత్రిగా పనిచేశారు. తకైచి 2024లో పార్టీ నాయకత్వానికి తన రెండవ పోటీలో నిలిచింది. అక్కడ ఆమె మొదటి రౌండ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. కానీ షిగెరు ఇషిబా చేతిలో తృటిలో ఓడిపోయింది. ఆమె 2025లో మళ్లీ పోటీ చేసి రెండు రౌండ్ల ఓటింగ్‌లోనూ మొదటి స్థానంలో నిలిచింది. షింజిరో కోయిజుమిని (Shinjiro Koizumi) ఓడించి LDP పార్టీ అధ్యక్షురాలైంది.

జపాన్ “లేడీ డొనాల్డ్ ట్రంప్”…

ఇక ప్రస్తుతం.. జపాన్ పార్లమెంట్ (Japan Parliament) సనే తకైచిని దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)కి చెందిన 64 ఏళ్ల సనే తకైచి కఠినమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ఆమె జపాన్‌కు 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జపాన్ ‘ఐరన్ లేడీ’గా పేరొందిన తకైచిని ఆమె విమర్శకులు ‘లేడీ డొనాల్డ్ ట్రంప్’ (Lady Donald Trump’) అని కూడా పిలుస్తారు. 64 ఏళ్ల తకైచి, రెండుసార్లు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసిన మాజీ ప్రధాని షిగేరు ఇషిబా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ లభించకపోవడంతో ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందు, తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (Japan Innovation Party), (JIP) తో సంకీర్ణం ఏర్పాటు చేసి విజయం సాధించింది. కొత్త ప్రధాని ఎన్నిక కోసం 465 స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. తకైచికి 237 ఓట్లు లభించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *