టాలీవుడ్ సూపర్ స్టార్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
ఇక విషయంలోకి వెళ్తే..
నిన్న నటుడు విజయ్ దేవరకొండ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సందడి చేశారు. ఇక్కడి శ్రీ సత్యసాయి విద్యాలయంలో విద్యనభ్యసించిన విజయ్ దేవరకొండకు పుట్టపర్తితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం.. ఆయన ప్రశాంతి నిలయం, శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ ప్రతినిధులతో విజయ్ భేటి అయ్యారు. ఇక సత్య సాయి జిల్లాలో టూర్ ముగించుకోని నేడు హైదరాబాద్ NH 44 హైవే పై ఉండవల్లి ప్రాంతంలో హీరో విజయ్ దేవరకొండ కార్ ప్రమాదానికి గురైనంది. NH 44 హై పై.. మలుపు వద్ద వెనక వస్తున్నా బొలెరో వాహనం ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో.. విజయ్ కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో.. విజయ్ దేవరకొండ కారు కొంత ముందుభాగం లో డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. కాగా అదే సమయంలో.. కారులో హీరో విజయ్ దేవరకొండ తో పాటు ఆయన తల్లి అలాగే పిఏ, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదం సమయంలో.. విజయ్ కార్ డ్రైవర్ చాకచక్యంగా కారును నడపడంతో ప్రమాదవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలిసింది. ఈ జంట వచ్చే ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇరువురు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.