Telangana is about to break the record in liquor sales..!

విజయదశమి, గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు (గురువారం) రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ‘డ్రై డే’ ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఫలితంగా, పండగకు ముందు రోజైన బుధవారం ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా రూ.340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.

ఇక విష‌యంలోకి వెళ్తే..

సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున రూ.100 నుంచి రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే దసరా పండగ, దానికి తోడు డ్రై డే ప్రకటనతో గత నాలుగు రోజులుగా విక్రయాలు అమాంతం పెరిగాయి. ఆదివారం రూ.280 కోట్లు, సోమవారం రూ.290 కోట్లు, మంగళవారం రూ.300 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇక బుధవారం ఉద్యోగులకు జీతాలు కూడా పడటంతో కొనుగోళ్లు తారస్థాయికి చేరాయి. పండగ రోజు మద్యం దొరకదనే కారణంతో చాలామంది నాలుగైదు రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, వేడుకల కోసం కూడా భారీగా ముందస్తు కొనుగోళ్లు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

ఇక గాంధీ జయంతి సందర్భంగా నేడు ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని, బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపించింది. అక్టోబర్ 2న దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజే మాంసం కొనుగోలు చేయాలని విక్రయదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బుధవారం నాడే మాంసం కోసం ఎగబడ్డారు. వెరసి, డ్రై డే ప్రకటన ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది.

ఇక ఈ రోజు పండ‌గు ను రేపు వాయిదా వేసుకున్నారు చాలా మంది. దీంతో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ధ్యం ఎరులై పార‌నుంది. ఇక మాసం దుకాణాలు అయితే.. కిక్కిరిసి పోనున్నాయి. ఇక తెలంగాణ వ‌ద్ద‌కు వ‌స్తే.. ద‌స‌ర పెద్ద పండుగా.. ఈ పండుగ‌కు విదేశాల్లో ఉన్న వాళ్లు సైతం సొంతురికి రావాల్సిందే. మ‌ద్యం తాగి చిందులేయాల్సిందే. ద‌స‌ర అంటే అంత వైబ్ ఉంట‌ది మ‌రి. మ‌రి ఈ పండుగ‌కు ఈ సారి గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా.. దేశ వ్యాప్తంగా మ‌ద్యం, మాంసం దుకాణాలు మూసీ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక రేపు మాంసంతో పాటు, మ‌ధ్యం షాపులు కూడా ఒపెన్ అవ్వ‌డంతో.. రేపు మ‌ద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ మందు బాబులు రికార్డ్ క్రియేట్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *