సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సెబు ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విలయానికి ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
ఫిలిప్పిన్స్ దేశంలోని మధ్య విసాయాస్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. బోగో సిటీ పక్కన ఉన్న తీరంలో మంగళవారం రాత్రి 9:59 గంటలకు (స్థానిక సమయం) 6.9 మాగ్నిట్యూడ్‌తో శక్తివంతమైన భూకంపం రావడంతో ఇప్పటివరకు కనీసం 69 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంవత్సరం దేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకర విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచింది. భూకంపం శక్తి కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కొన్ని భవనాలు, వంతెనలు, రోడ్లు కూలిపోయాయి. భూకంప కేంద్రం (ఎపిసెంటర్) బోగో నగరం నుంచి 19 కి.మీ. దూరంలో ఉండగా, దీని లోతు 5 నుంచి 10 కి.మీ.గా అంచనా వేస్తున్నారు. చారిత్రక కట్టడాలు సహా అనేక ఆస్తులకు నష్టం జరిగింది.
భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 69కి చేరుకుంది. వీరిలో బోగో నగరంలో 14 నుంచి 35 మంది, మెడెలిన్, సాన్ రెమిజియోలో మిగిలినవారు ఉన్నారు. ఎక్కువ మంది భవనాలు కూలిపోవడంతో, శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. కూలిపోయిన గోడల కారణంగా ఒక బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న ముగ్గురు కోస్ట్‌గార్డ్ సిబ్బంది, ఒక అగ్నిమాపక సిబ్బంది, ఒక పిల్లవాడు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 140-150కి పైగా ఉంది. గాయపడిన వారితో సీబు ప్రాంతంలోని ఆసుపత్రులు పూర్తిగా ఓవర్‌లోడ్ అయ్యాయి. గాయపడిన పిల్లలు, పెద్దలకు ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన నీలం టెంట్‌లలో చికిత్స అందిస్తున్నారు. శిథిలాలలో మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
దెబ్బతిన్న ప్రాంతాలు, కీలక నిర్మాణాల నష్టం..
సుమారు 3.4 మిలియన్ జనాభా, ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన సీబు ప్రావిన్స్‌లో అత్యధిక నష్టం జరిగింది. బోగో, డాన్‌బంటయన్, మెడెలిన్, సాన్ రెమిజియో, టాబోగోన్ వంటి ప్రాంతాలలో అనేక భవనాలు, ఇళ్లు, చర్చిలు, ఆసుపత్రులు, మాల్స్ కూలిపోయాయి. చారిత్రక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, 100 ఏళ్ల చరిత్ర గల ఆర్చ్‌డయోసెసన్ ష్రైన్ ఆఫ్ సాంటా రోజా డి లిమా (డాన్‌బంటయన్) లోని గోపురం కూలిపోయింది. సెయింట్స్ పీటర్ అండ్ పాల్ పారిష్ (బంటయన్ ద్వీపం) కూడా దెబ్బతింది. ఆర్చ్‌బిషప్ ప్రజలను చర్చిలకు వెళ్లవద్దని హెచ్చరించారు.