Former ministers sentenced to death for massive corruption in China

చైనా దేశ నిర్ణయానికి ప్రపంచం మొత్తం ప్రశంసలు..

చైనా ఈ దేశం గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పని లేదు. అక్కడి తిసుకునే కఠి నిర్ణయాలే.. ఈ దేశంను అభివృద్ధులో నిలుపుతుంది. అగ్రరాజ్యం అమెరికాకు పోటి పడుతుంది. ఒక్క విధంగా చెప్పాలంటే.. చైనా ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాదు.. స్కాంలలో కూడా ప్రగతి సాధిస్తుంది. ఇటీవల ఒక మాజీ కేంద్ర మంత్రికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. ఇది యాతవ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా అనగానే మనకు ప్రధానంగా వినిపించేది ఎగుమతులు. ఏ దేశంలోనైనా సరే ఆ దేశానికి సంబంధించి కొన్ని విడిభాగాల్లో చైనా భాగాలు వాడాల్సిందే. అవి చాలా చీప్ కాబట్టి ఎక్కువగా కొనుగోలు జరుగుంది.

ఇక విషయంలోకి వెళ్తే..

అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న చైనా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి పరులపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు ఇటీవల వరల్డ్ హెడ్ లైన్స్ లోకి ఎక్కింది. జిలిన్ ప్రావిన్స్‌లో వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్ కు ఉరి శిక్ష విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్క సారిగా చైనా దేశం ఉలిక్కి పడింది. 2007–24 మధ్యకాలంలో అధికారం దుర్వినియోగం చేసి రూ. 334 కోట్ల (268 మిలియన్ యువాన్లు) లంచాలు తీసుకున్న కేసులో మరణశిక్ష పడింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి, లంచం మొత్తం దేశ ఖజానాకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆయనపై జీవితకాల రాజకీయ కార్యకలాపాల నిషేధం కూడా విధించారు.

చైనా మాజీ వ్యవసాయ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష

దేశ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష విధిస్తూ జిలిన్ ప్రావిన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుమారు రూ.334 కోట్ల విలువైన లంచాలు స్వీకరించినట్లు ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది. అయితే, విచారణకు పూర్తిగా సహకరించినందున శిక్ష అమలును రెండేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. టాంగ్ రెన్‌జియాన్‌ 2007 నుంచి 2024 మధ్య కాలంలో పలు ప్రభుత్వ ఉన్నత పదవుల్లో పనిచేశారు. ఈ సమయంలో ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది. వ్యాపార సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం, కాంట్రాక్టులు ఇప్పించడం, ఉద్యోగ నియామకాలు జరపడం వంటి పనుల కోసం భారీ మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు కోర్టు నిర్ధారించింది. మొత్తం 268 మిలియన్ యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ.334 కోట్లు) విలువైన నగదు, ఆస్తులు, ఇతర విలువైన వస్తువులను ఆయన లంచాల రూపంలో తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. విచారణ సమయంలో టాంగ్ తన నేరాలన్నింటినీ అంగీకరించారు. మరణశిక్షతో పాటు, టాంగ్ రెన్‌జియాన్‌పై మరిన్ని కఠిన చర్యలకు కోర్టు ఆదేశించింది. ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం నిషేధం విధించింది. ఆయన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ పూర్తిగా జప్తు చేయాలని, అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని స్పష్టం చేసింది.

రూ.334 కోట్ల అవినీతికి పాల్పడినట్లు తేల్చిన కోర్టు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టినప్పటి నుంచి అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. టాంగ్ రెన్‌జియాన్‌పై తీసుకున్న ఈ చర్య కూడా ఆ పోరాటంలో భాగమేనని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్పు చైనాలో అవినీతికి పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *