Avatar 3 Trailer : ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనం ఈ మూవీ. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతిని కళ్లకు కట్టే విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. రూ. వందల కోట్లు సాధించి మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2009లో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలై అప్పటివరకూ ఉన్న టైటానిక్ రికార్డులను చెరిపేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

ఇక తాజాగా.. ‘ది వే ఆఫ్ వాటర్’ (The Way of Water) లో సముద్ర గిరిజనులను (Metkayina) చూపించిన కామెరూన్, ఈసారి ‘యాష్ పీపుల్’ అనే కొత్త నవీ తెగను పరిచయం చేశారు. ‘అవతార్’ సిరీస్‌లో మూడవ భాగం ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’’ నుంచి అద్భుతమైన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రాగా, పండోరా ప్రపంచాన్ని ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే రెండు పార్టులు వచ్చి ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు మూడో పార్టు కోసం అంతా రెడీ అవుతోంది. ఈ సందర్భంగా గత రెండు నెలల క్రితమే ఓ ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

ఇప్పుడు తాజాగా మరో కొత్త ట్రైలర్ ను వదిలారు. ఇది కూడా విజువల్ ఫీస్ అనిపిస్తోంది. సినిమా ప్రపంచాన్ని శాసించిన సినిమా యూనివర్స్ ఇది. రెండో ట్రైలర్ లో నీటి ప్రపంచాన్ని హైలెట్ చేసిన జేమ్స్.. మూడో పార్టు అడవులను హైలెట్ చేస్తూ తీసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు కట్టి పడేసేలా ఉన్నాయి. రెండు తెగల నడుమ జరిగిన యుద్ధాన్ని విజువల్ వండర్ లా తీర్చిదిద్దాడు. ఇందులో మానవ తెగ మరో అంశం. వీఎఫ్ ఎక్స్ అద్భుతంగా అనిపిస్తోంది. మరి ఈ మూడో పార్టు కూడా ప్రపంచాన్ని మెప్పిస్తుందా లేదా అనేది మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది.

ట్రైలర్‌లో చూపించిన అగ్ని పర్వత ప్రాంతాలు, పగటిపూట మెరిసే లావా ప్రవాహాలు, అంతకుముందెన్నడూ చూడని కొత్త జీవులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ గ్రాండియర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘అవతార్ 4’, అలాగే చివరిగా రానున్న ‘అవతార్ 5’ 2031 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.