కేరళకు చెందిన వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసి, అనంతరం ఫేస్‌బుక్‌లో తన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషాద సంఘటన కొల్లం జిల్లాలోని పునలూరులో చోటుచేసుకుంది. మృతురాలు షాలిని తన తల్లి వద్ద నివాసం ఉంటోంది. ఆమె స్నానం చేస్తుండగా ఇంట్లోకి చొరబడిన భర్త ఐజాక్ ఆమెపై దాడి చేసి హత్య చేశాడు.
ఇక విషయంలోకి వెళ్తే..

కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూర్ సమీపంలోని కూతనడిలో జరిగింది. షైలిన్, ఐజాక్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో షైలిన్ స్నానం చేయడానికి వంటగది వెనుక ఉన్న పైప్‌లైన్ దగ్గరకు వెళ్ళినప్పుడు, ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో షాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె విలవిల్లాడి మరణించింది. ఐజాక్, షాలిని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో ఒకరు సంఘటన స్థలంలోనే ఉన్నారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని షాలిని మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఐజాక్ అక్కడి నుంచి పారిపోయి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తన నేరాన్ని అంగీకరించాడు. తనపై నమ్మకం లేకపోవడం, అలాగే ఆభరణాల దుర్వినియోగం చేసిందని, అందుకే ఆమెను హతమార్చినట్లు లైవ్‌లో వెల్లడించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన షాలిని (39)గా పోలీసులు గుర్తించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఐజాక్, షైలిన్ మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక స్థానికంగా ఉన్న పాఠశాలలో షాలిని కేర్‌టేకర్‌గా పని చేస్తోంది.