Bhanu Nani cheated by Gemini AI

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏంట నడుస్తుంది అంటే.. అందరి నుంచి ఒకటే మాట. అదే నానో బనానా ట్రెండ్. అవును ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన నానా బనానా ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. రోజుకో రకం ప్రాంప్ట్ తో జెమినీ ఏఐ యువతను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఇన్ స్టాగ్రామ్’ లో శారీ ట్రెండ్ కొనసాగుతోంది. యువతులు తమ ఫొటోలను అప్ లోడ్ చేస్తే వారిని చీర కట్టుకున్నట్లు గూగుల్ జెమినీ ఏఐ మార్చేస్తోంది. ఈ ఫొటోలను చూసి మహిళలు మురిసిపోతున్నారు. అయితే, ఈ ట్రెండ్ కొంతమందికి షాకిస్తోంది. శారీ ట్రెండ్ ను ఫాలో అయిన తనకు షాకింగ్ అనుభవం ఎదురైందంటూ జలక్ భావ్ నానీ అనే యువతి పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ రీల్ పోస్ట్ చేసింది.

ఇక విషయంలోకి వెళ్తే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జెమిని ఏఐ విపరితంగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ట్రెండ్ చూసి ప్రతి ఒక్కరు ఇమేజ్ జనరేటర్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా అలా చేసిన ఒక అమ్మాయి తన ఫోటోను చూసి కంగుతింది. ఇటీవలే ఒక అమ్మాయి పూర్తిగా తన శరీరాన్ని కప్పి ఉంచి ఉండే పంజాబీ డ్రెస్ లో ఉన్న ఓ ఫోటోను అప్డేట్ చేస్తే నల్ల చీర కట్టుకున్నట్లు గూగుల్ జెమినీ ఏఐ మార్చేసిందని భావ్ నానీ తెలిపింది. ఇందులో వింతేమి ఉంది అంటారా.. అయితే ఆగండి అక్కడికే వస్తున్నా.. ఏఐ మార్చేసిన ఫొటోను జాగ్రత్తగా చూస్తే తన భుజంపై పుట్టుమచ్చ కనిపించింది. నిజంగానే తనకు ఆ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉందని చెప్పిన భావ్ నానీ.. ఈ విషయం ఏఐ ఎలా కనిపెట్టిందని అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో జెమిని ఏఐ తో స్త్రీ ప్రైవేట్ పాట్స్ భద్రత లేదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే కాకుండా.. దీనికి పలువురు నెటిజన్లు కామెంట్‌ బాక్స్ లో వివరణ ఇచ్చారు. గతంలో మీరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫొటోలను కూడా ఏఐ పరిశీలిస్తుందని, వాటి ఆధారంగా ఏఐ ఫొటోను జెనరేట్ చేస్తుందని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *