Serial murders in Kukatpally.. Psycho killer who killed with a cooker
  • కూకట్ పల్లిలో మరో హత్య..
  • హత్యలకు కేరాఫ్ గా కూకట్ పల్లి..
  • వరుస హత్యలతో హడలెత్తిపోతున్న కూకట్ పల్లి..
  • అప్పుడు కుక్కర్ లో ఉడికిచ్చాడు.. ఇప్పుడు కుక్కర్ చావబాదాడు..
  • ఏంటి ఈ సైకో ఇజం.. ఇంటి సామాగ్రే మారుణాయుధాలు
  • స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ లో సీరియల్ కిల్లర్
  • హత్య చేసి.. స్నానం చేసి ఓనర్ బైక్ పైనే పరార్

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో మరణం ఎక్కడి నుంచి వస్తుందో అని భయం పడేవాళ్ళం. కానీ ప్రస్తుత మరణం ఏ వస్తువుతో వస్తుంది అని భయం భయంతో ఉన్నారు. ఇక ఇప్పటికే రకరకాలుగా.. హత్యలు చూసి ఉన్నాం. ఒక్కడ హత్య ఒకటే.. కానీ హత్యలు చేసే మార్గాలే వేరు. తుపాకులు అవసరం లేదు.. కత్తులు అంతకన్నా అవసరం లేదు. ఇంట్లో ఉండే వంట సామాన్ తో కూడా హత్యలు చేయవచ్చు అన్నట్లుగా.. ఇప్పటి సైకోలు తయారు అవుతున్నారు. చేతికి ఏది దొరికిన ఆ క్షణంలో అది మారునాయుధంగ మారిపోతుంది. గతంలో కుక్కర్ లో మనిషిని ఊడిగించి చంపిన విషయం మరవక ముందే.. ఇప్పుడు అదే కుక్కర్ తో మనిషిని కొట్టించంపాడు ఓ దుండగుడు.

ఇక విషయంలోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన దారుణ హత్యాకాండ సమాజాన్ని కలవరపరిచింది. ఈ సంఘటన, ఇంటి లోపలే భద్రత లేకపోవడాన్ని, దుండగుల తిరుగుబాటును హైలైట్ చేస్తోంది. మృతురాలు గుర్తుతెలియని దుండగుల చేతిలో అతి క్రూరంగా ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల ప్రకారం, ఈ హత్యలో ఇంట్లో పనిచేసే యువకుడు, పై అంతస్తులో పనిచేసే మరొకరు పాలుపంచుకున్నట్లు అనుమానం ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఇంకా స్పష్టం కాలేదు, కానీ దోపిడీ లేదా వ్యక్తిగత శత్రుత్వాలు కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే..

కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ గేటెడ్‌ కమ్యూనిటీలోని అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తులో ఉండే రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళ సెప్టెంబర్​ 10వ తేదీన (బుధవారం) సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇదే సమయంలో సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా లిఫ్ట్‌ లో ప్రయాణించిన దృశ్యాలు రికార్డు కావడం దర్యాప్తునకు మరింత బలం చేకూర్చింది. దీంతో రేణు అగర్వాల్‌ను పనిమనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాళ్లు, చేతులు కట్టేసి, ప్రెషర్ కుక్కర్‌తో రేణు తల మీద మోది, కత్తితో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకెళ్లారు. ఆ తర్వాత బట్టలకు రక్తం మరకలు అంటడంతో ఆ దుస్తులను అక్కడే వదలేసి తాపీగా స్నానం చేసి వేరే దుస్తులు వేసుకొని.. రేణు అగర్వాల్ స్కూటీ పైనే పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

హత్యకు 11 రోజుల క్రితమే ప్లాన్..

బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. హత్యకు 11 రోజుల క్రితమే వీళ్ల ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు యువకులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో ఇద్దరు అంటే మృతురాలి ఇంట్లో పనిచేసే 25 ఏళ్ల హర్ష, పై అంతస్తు లోని ఇంట్లో పని చేసే రోషన్ ఈ హత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ జార్ఖండ్‌కి చెందినవారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇంట్లో పనిచేసే యువకుడు కొన్ని రోజులుగా ఆమె నగలు, డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేస్తూ ఉండి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ మహిళ మొబైల్ ఫోన్ రికార్డుల్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ కేసును స్పెషల్ టీమ్‌కు అప్పగించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఇతర హత్యాకాండలను గుర్తు చేస్తోంది. గత ఏడాది కూకట్‌పల్లిలోనే ఒక మహిళను దోపిడీ చేసి చంపిన సంఘటన జరిగింది. ఈసారి కూడా ఇంట్లో పని చేసే వారినే అనుమానిస్తున్నారు. ఇది డొమెస్టిక్ వర్కర్ల మీద నమ్మకం దెబ్బతినడానికి కారణమవుతోంది. స్థానికులు, మహిళా సంఘాలు ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇంట్లో పని చేసే వారిని ఎలా ట్రస్ట్ చేయాలి? భద్రతా చర్యలు అవసరం” అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తమ పరిధిలోకి తీసుకుని, మహిళా భద్రతకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *