Thammudu Rerelease : ప్రస్తుతం స్టార్ హీరోల బర్తడే అంటే చాలు వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలలో రీ రిలీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో.. ఆయన సూపర్ హిట్ సినిమా తమ్ముడు రీ రిలీజ్ చేయడానికి.. సన్నహాలు పూర్తయ్యాయి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. యువత కూడా ఈ ట్రెండ్ కి ప్రత్యేక ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి వారం ఏదో ఒక క్లాసిక్ మూవీ థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. దీంతో ఈ రీ రిలీజ్ లో పవన్ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అని పవన్ అభిమానులు చెప్పుకోస్తున్నారు. ఈసారి పవన్ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ మూవీ ‘తమ్ముడు’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పి. ఎ. అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ‘తమ్ముడు’ సినిమా రేపు రీరిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. తొలుత సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేద్దామని భావించి తాజాగా డేట్ మార్చారు. ఇక ఆగస్ట్ 30 నుంచి ‘తమ్ముడు’ ను గ్రాండ్ గా థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతోన్నారు. ఈ రీ రిలీజ్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సమీపంలో జరగనుండడంతో, అభిమానులకు ప్రత్యేక పండుగ వాతావరణాన్ని అందించనుంది.
‘తమ్ముడు’ 1999లో విడుదలై పెద్ద హిట్టుగా నిలిచింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో నటించారు. బి. శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమా, రమణ గోగుల సంగీతం వల్ల ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా జనాల్ని ఉర్రూతలుగిస్తున్న ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జల్సా’ సినిమా కూడా పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలవనుంది.