మనలో చాలా మంది రాత్రుళ్లు నిద్ర (Sleep) రాక.. బెడ్బుతో, దిండుతో కుస్తి చేస్తుంటారు. అటూ పొర్లి, ఇటు పొర్లే సరికి అర్ధ రాత్రి దాటిపోయి, తెల్లారిపోతుంది కూడా. ఇలా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలని ఉందా.. అయితే ఈ ట్రిక్ యూజ్ చేయండి మీకు ఇట్టే నిద్ర పట్టేస్తుంది.

మొదటిగా.. పగలు నిద్ర పోవడం తగ్గించుకోండి. పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుంది.. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టదు. మీరు పడుకోవడానికి కొద్ది గంటల ముందే శరీరాన్ని నిద్రకు సిద్ధం చేయాలి. అంటే టీవీ, ఫోన్ చూడటం స్కిప్ చేయాలి.. ఇంకా చెప్పాలంటే.. రాత్రి ఏ పనీ పెట్టుకోవద్దు.. అలా చేస్తే మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఇక సమస్యకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమం. ప్రతి రోజు కొద్ది దూరం నడక గానీ పరుగు గానీ సైకిల్ తొక్కటం వంటివి చేస్తే మనసు, శరీరం ఉత్సాహంతో ఉంటుంది. దీంతో రాత్రిపూట నిద్ర గాఢంగా పడుతుంది.

ఇదే కాకుండా.. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యం. దీంతో నిద్ర వేళలు నియమబద్ధం అవుతాయి. ఇక త్వరగా నిద్ర పట్టాలంటే.. సాయంత్రం వేళ గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, గ్లాసు పాలు తాగడం, లైట్ల వెలుగు తగ్గించడం ద్వారా నిద్ర పడుతుంది. రాత్రి పూట ఇష్టమైన పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వంటి మనసుకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఎట్టి పరిస్థితిలో.. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ ఎక్కువగా తగకండి. అవి తాగడం వల్ల రాత్రి నిద్ర పట్టటం కష్టమవుతుంది. అంతే కాకుండా.. కూల్ డ్రింకులు, రెడ్ వైన్, చాక్లెట్లు, ఛీజ్ వంటివీ తినకూడదు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి.