గులాబ్ జాము (Gulab Jamu)… ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కధా.. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. మన ఇంట్లో తమ్ముడిదో, నాన్నదో, అక్క దో బర్త్ డే ఉందా.. అయితే ఆ రోజు ఇంట్లో గులాబ్ జాము జామ్ గుమగుమలాడాల్సిందే. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా… ఆ గులాబ్ జామ్ కి ఆ పేరు ఎలా వచ్చిందని. కాస్త ఆ గులాబ్ జాము చరిత్రలోకి వెళ్తే.. అప్పట్లో లుక్మత్ అల్-ఖది ( Luqmat Al Qadi) అనే తీపి వంటకం అనేది ఉండేది. మొఘల్ రాజులు (Mughal kings) మన భారతదేశానికి వచ్చినప్పుడు.. వాస్తుశిల్పంతోపాటు ఈ వంటకాన్ని కూడా తీసుకొచ్చారు. షాజహాన్ (Shah Jahan) కాలంలో ఈ తీపి వంటకంపై అప్పటి రాజులు లుక్మత్ అల్-ఖది అనే తీపి వంటకం పై ప్రయోగాలు చేపించారు. ఆ ప్రయోగంలో తయారు అయ్యింది.. ఈ గులాబ్ జామ్. ఇక ఈ ప్రయోగంలో పుట్టిన గులాబ్ జాము.. రాజ కుటుంబానికి బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈ వంటకం ప్రతి ఇంటికి చేరింది. ప్రతి ఒక్కరిని నోరూరించింది.
