దేశంలో టూవీలర్ మొబిలిటీ రంగంలో ర్యాపిడో అతిపెద్ద సంస్థగా ఎదిగిందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూజర్లను తమ ఫ్లాట్ ఫారం ఉపయోగించేందుకు అనేక యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించిన వచ్చింది. క్యాష్ బ్యాక్, తక్కువ ధరకు రైడ్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(CCPA) రూ.10 లక్షల ఫైన్ వేసింది. ‘5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ.50 పొందండి’ అంటూ తప్పుదోవ పట్టించారన్న ఫిర్యాదుపై చర్యలకు దిగింది. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా కండిషన్స్ పేరుతో కాయిన్స్ ఇచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రచారంతో ప్రభావితమైన వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది. 2024 జూన్ నుంచి 2025 జులై మధ్యకాలంలో ఈ ర్యాపిడో కస్టమర్ల నుంచి దాదాపు 1200పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా అధిక ధరల వసూలు, డబ్బు రీఫండ్ ఆలస్యం, డ్రైవర్ల దుర్వినయోగం, క్యాష్బ్యాక్ ఇచ్చే వాగ్దానాల ఉల్లంఘన వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి కేవలం బైక్ రైడ్స్కి మాత్రమే వర్తించేలా, అవి కూడా ఏడు రోజుల్లోనే వినియోగించేలా షరతులు పెట్టింది. దీంతో.. CCPA రంగంలోకి దిగి భారీ జరిమానా విధించింది.