- నీటిలో మహా నగరం..
- భారీ వర్షం ముంచెత్తింది..
- ముంబై మహా నగరం నీట మునిగింది..
- కుండపోతవానకు నగరం నరకంలా మారింది..
- రవాణ స్తంభించిపోయింది.. లోకల్ ట్రైన్ నీట మునిగాయ్..
- మెట్రో ఆగిపోయింది.. జనజీవనం అస్తవ్యస్తం..
- లోతట్టు ప్రాంతాలు జలమయం..
- ముంబైకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
- 17 లోకల్ రైలు సర్వీసుల రద్దు..
- విమాన సర్వీసులకు హెచ్చరిక..
- థానే, నవీ ముంబైలలో పాఠశాలలకు సెలవులు
- ముంబై మహా నగరం నీట మునిగింది..
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
ప్రస్తుతం భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇక ముంబై తీరంలో సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఐఎండీ (IMD), ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని కుర్లా, సియోన్, కింగ్స్ సర్కిల్, హింద్మాతా, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జేపీ రోడ్, మిలన్ సబ్‌వే, ఎల్‌బీఎస్ రోడ్‌లోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షపునీరు ఆగిపోయింది. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విమాన సర్వీసులకు హెచ్చరిక..
ఛత్రపతి శివాజీ టెర్మినస్ (Chhatrapati Shivaji Terminus) -థానే మధ్యలో దాదాపు 8 గంటల తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సీఎస్ఎంటీ- మన ఖుర్ద్ హార్బర్ లైన్లో రైళ్లు మాత్రం నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి 253 విమానాల టేకాఫ్, మరో 163 విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. దృగ్గోచరత సరిగాలేక 8 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
17 లోకల్ రైలు సర్వీసుల రద్దు..
ఇక ఈ కుంభవృష్టికి.. ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, గగన తలంపై కూడా వర్ష ప్రభావం పడింది. దీంతో.. విమాన సర్వీసులపైనా ఆరా తీస్తున్నారు. ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో (Indigo), స్పైస్‌జెట్ (Spicejet) తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.
ఆ జిల్లాలకు హై అలెర్ట్..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ( Maharashtra CM )దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పరిస్థితిని సమీక్షించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. దీనికితోడు పెద్ద ఎత్తున ఆస్తులు, పంటలు కూడా దెబ్బతిన్నాయి. వర్షం, వరదల కారణంగా వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇక వడాలా స్టేషన్కు సమీపంలో 200 మంది ప్రయాణికులతో నిలిచిపోయిన మరో మోనోరైలును అధికారులు విజయవంతంగా వెనక్కి తీసుకెళ్లారు. కాగా, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమైన సమయమని సీఎం అన్నారు. ముంబై, థానె, రాస్గఢ్, గడ్చిరోలి, మరాఠ్వాడా, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.