గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస విద్యుత్ షాక్ లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు కరెంట్ పోల్స్ వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటీవలే రామంతపూర్ లో శ్రీ కృష్ణాజన్మస్టమీ ర్యాలీలో ఏడుగురు విద్యుత్ షాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి విద్యుత్ షాక్ కు బలయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం రేణి సీజన్.. ఈ సీజన్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. విద్యుత్ పోల్స్ వద్ద నీరు నిలవడం వల్ల.. కరెంట్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో అటువైపుగా వెళ్తున్న వాళ్లు అది గమనించకా.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.
మూత్ర విసర్జన చేస్తుండగా.. ఘటన
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వర్షం పడటంతో తడిగా మారిపోయింది. అయితే ఆ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఓ యువకుడు మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా అతనికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు.. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే హై ఓల్టేజ్ షాక్ తగలటంతో.. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని పట్టణానికి చెందిన దంతాల చక్రాధర్ (50) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటను సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తస్మాత్ జాగ్రత్త..!
ప్రజలందరు కూడా ఈ వర్ష కాలంలో కాస్త ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వర్షం పడినప్పుడు విద్యుత్ సంభాల నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఉన్నట్లు మనం గమనించలేం. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక పట్టన ప్రాంతాల్లో అయితే.. విద్యుత్ స్తంభాల వద్దనే చెత్త చెదారం, మూత్ర విసర్జనలు చేస్తుంటారు. చెత్త వేసేటప్పుడైనా.. మూత్ర విసర్జన చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకాస్త చెప్పాలంటే.. విద్యుత్ స్తంభాలు ఉన్న చోట చెత్త గానీ, మూత్ర విసర్జన చేయకపోవడం చాలా మంచిది. అలా చేసినట్లు అయితే.. చావును కొని తెచ్చుకున్న ట్లు అవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, పిల్లలకు గానీ, వృద్యులకు గానీ మరి మరి చెప్పండి. విద్యుత్ పోల్స్ పరిసర ప్రాంతాల్లో గానీ, విద్యుత్ వైర్లు ఉన్న తడి ప్రాంతాలలో గానీ అస్సలు వెళ్లకూడదు. తస్మాత్ జాగ్రత్త సుమా..!