గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay)వంటి యూపీఐ (UPI) యాప్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇకపై యూపీఐలో రిక్వెస్ట్ మనీ ఫీచర్ (Money Feature) కనుమరుగు కానుంది. అవును మీరు విన్నది నిజమే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఇకపై ఉండదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నిత్యం లక్షల్లో మనీ లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో NPCI యూజర్ల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంది. P2P వల్ల భారీగా ఆర్ధిక మోసాళు జరుగుతున్నట్లు ఈ విషయం ఎన్‌పీసీఐ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ మేరకు రిక్వెస్ట్ మనీ ఫీచర్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలో 2019లోనే ఫుల్ ట్రాన్సాక్షన్లలో గరిష్ఠ లిమిట్ రూ.2 వేలకు పరిమితం చేసింది ఎన్‌పీసీఐ. అయినప్పటికీ ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్‌తో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

వాస్తవానికి ఈ ఫీచర్ వల్ల.. పెద్ద ఎత్తున సైబర్ మోసాళు జరుగుతున్నట్లు NPCI గుర్తించింది. దీంతో అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్స్‌లో కలెక్ట్ రిక్వెస్ట్ (రిక్వెస్ట్ మనీ) ఫీచర్ నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్ యాప్స్‌కు ఎన్‌పీసీఐ సూచించింది. ఈ మేరకు ఇటీవలే ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అక్టోబర్ 1 లోపు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్స్ తమ సిస్టమ్స్‌లో తగిన విధంగా మార్పులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ కనుమరుగు కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇక ఆ ఫీచర్ కనబడదు. ఎవరైనా డబ్బులు పంపించాం అంటూ అలాంటి మెసేజ్ చేసే అవకాశం ఉండదు. అలా రిక్వెస్ట్ మనీ మెసేజ్ చేస్తూ మోసాలు చేస్తున్న వారికి చెక్ పడినట్లవుతుంది. అయితే, కొన్నిసార్లు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూపీఐ యూజర్లు చెబుతుంటారు. అయితే, లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండటంతో.. ఆ ఫీచర్ ను NPCI తొలగించినట్లు వెల్లడించింది.