భూ ప్రపంచం భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. కొన్ని రాష్ట్రాల్లో వరదల తో జల ప్రళయాని సృష్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్ (Kishtwar)లోని చోసిటీ (Chashoti)లో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 12 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. కిష్త్వార్‌లోని హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా యాత్రకు చసోటి ప్రారంభ స్థానం. కిష్త్వార్‌లోని చసోటి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో చాలా మంది భక్తులు అక్కడ ఉన్నట్లు సమాచారం. వరదల కారణంగా చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న NDRF, SDRF బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మాచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra)ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..
ఇక ఈ భారీ క్లౌడ్ బస్ట్ కి.. రాజోరిలో వాగులు, వంకలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి . అధికారులు వెంటనే భారీ సహాయక చర్యలు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచెల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో భారీగా కొండచరియలు విరిగపడ్డాయి. భారీ సంఖ్యలో ఆ సమయంలో భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. NDRF బృందాలతో పాటు పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..
ఇక ఇదే కాకుండా.. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) వరదల బీభత్సం కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలతో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా (Shimla), లాహౌల్, స్పితి జిల్లాల్లో చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వరదలతో హిమాచల్‌లో 300 రోడ్లను మూసేశారు. గన్వి రావైన్‌లో (Ganvi Ravine) వరదలకు ఓ పోలీసు పోస్ట్ కూడా కొట్టుకుపోయింది. అయితే వరదల కారణంగా లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సిమ్లా సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (State Emergency Operation Center) ప్రకారం.. మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రూ.2,031 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.