స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోల్కండ కోట (Golconda Fort) అంగరంగ వైభంగా ముస్తాం అవుతుంది. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో (Rani Mahal Lance) రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. స్వాతంత్ర్య దీనోత్సవం సందర్భంగా.. గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాల దారిని మర్లించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. దీంతో పోలీసుల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
దీని ప్రకారం, రామ్‌దేవ్‌గూడ నుండి గోల్కొండ కోట వరకు ఉన్న రహదారిని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు మూసివేస్తారు. అవసరాన్ని బట్టి ఈ క్రింది మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించబడుతుంది.

గోల్ఫ్ క్లబ్ లేన్ : సెవెన్ టూంబ్స్ నుండి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్‌ను జమాలి దర్వాజా వైపు మళ్లిస్తారు.
గోల్కొండ బస్ స్టాప్ : GHMC గ్రౌండ్, GHMC ద్వీపం నుండి వచ్చే ట్రాఫిక్‌ను మోతీ మహల్ X రోడ్ వైపు మళ్లిస్తారు.
తవాకల్ స్టోర్, బడా బజార్ : బడా బజార్ నుండి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్‌ను GHMC ద్వీపం వైపు మళ్లిస్తారు.
ఇబ్రహీం మెడికల్ హాల్ : చోటా బజార్ నుండి గోల్కొండ కోట వైపు వచ్చే స్థానిక ట్రాఫిక్‌ను మోతి దర్వాజా వైపు మళ్లిస్తారు.
రాందేవ్‌గూడ “టి’ జంక్షన్ : నర్సింగ్గి మరియు టిప్పు ఖాన్ వంతెన నుండి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాందేవ్‌గూడ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.