బుడమేరు వాగు (Budameru stream) … ఈ వాగు గురించి మనకన్న విజయవాడ (Vijayawada) ప్రజలకే ఎక్కువ తెలుసు. ఆ వాగు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. విజయవాడ ప్రజలకు కూడు, గూడు లేకుండా చేసింది. వందలాది మందిని రోడ్డున పడేసింది. ఓ పిల్ల కాలువ. ఇక ప్రస్తుతం భారీ వర్షాలతో ఆ బుడమేరు వాగు మళ్లీ పెరుగుతోంది. దీంతో విజయవాడ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని బిక్కు బిక్కు మంటున్నారు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా కృష్ణా నదిలో (Krishna river) ప్రవాహం అంతకంతకు పెరగడంతో.. ఆ ప్రభావం బుడమేరు వాగుపై పడింది. దీంతో బుడమేరు వాగులో ప్రవాహం సైతం క్షణం క్షణానికి నీటి మట్టం పెరుగుతు టెక్షన్ పెట్టిస్తుంది.
తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో.. గుణదల వంతెన (Gunadala Bridge) పైనుంచి బుడమేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. కానీ అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. కాగా- గత ఏడాది తరహాలో బుడమేరు మళ్లీ ఉప్పొంగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ జిల్లా (NTR Distt) కలెక్టర్ లక్ష్మీశ స్పందించారు. ఇందులో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వెలిగల్లు రెగ్యులేటర్ వద్దకు వరద ప్రవాహం ఇంకా చేరుకోలేదని పేర్కొన్నారు. బుడమేరు పొడవునా వరద ప్రవాహ తీవ్రతను జాగ్రత్తగా పరిశీలిస్తోన్నామని, ఇప్పుడున్న నీళ్లు వర్షం వల్ల చేరుకున్నవేనని వివరించారు. పులివాగు నుంచి వరద నీరు రాలేదని స్పష్టం చేశారు. విజయవాడకు బుడమేరు వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక మరో వైపు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీరు విడుదల చేస్తే 24 గంటల ముందే అందరినీ అలర్ట్ చేస్తామని లక్ష్మీశ (Lakshmi) పేర్కొన్నారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తరువాతే వరద నీటిని బుడమేరుకు విడుదల చేస్తామని చెప్పారు. వరద ప్రవాహంపై జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9154970454 నంబర్ కు ఫోన్ చేయవచ్చని అన్నారు.