Padmanabhaswamy : 1000 ఏళ్ల నాటి మిస్టరీకి తెర.. 6వ గది ఓపెన్.. 5 లక్షల కోట్లు ఉన్నట్లు అంచనా..?
- పద్మనాభస్వామి ఆలయ బి-నెలమాళిగ అంశం మళ్లీ తెరపైకి!
- ఐదేళ్ల విరామం తర్వాత పాలక, సలహా మండళ్ల సమావేశం
- తుది నిర్ణయం తీసుకునే బాధ్యత ఆలయ తంత్రికే అప్పగింత
- సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎలాంటి పురోగతి
- రహస్యాలు, ఆధ్యాత్మిక కారణాలతో ఇప్పటికీ తెరుచుకోని గది
- గతంలో తెరిచారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ట్రావెన్‌కోర్ రాజకుటుంబం
ప్రపంచంలోనే సంపన్న దేవాలయం..
ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అనగానే టక్కున గుర్తుకువ చ్చే పేరు ఆ వడ్డికాసుల వాడు కొలువైన అనంత పద్మనాభస్వామి దేవాలయం. అవును మీరు విన్నది నిజమే.. ఆ ఆలయ సంపద ఎంత ఉంది అంటే.. దాదాపు మూడు పెద్ద దేశాలు ఆర్థిక బడ్జెట్ అంతా. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో ఆరు రహస్య గదులు విషయం తెలిసిందే. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్రవైడ్యుర్యాలు, స్వర్ణ విగ్రహాలు, పదుల సంఖ్యల్లో బంగారపు ఏనుగులు, బంగారపు గొలుసులు, కుప్పలు కుప్పలుగా రాశులు, ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా పడి ఉన్న వజ్రాలు, విష్ణు దేవుని విగ్రహాలు, బంగారు చెప్పులు, విదేశీ బంగారం, బంగారపు తలుపులు, కడ్గాలు, ఇలా ఒకటా రెండా… ఆ సంపదను తరలించాలంటే దాదాపు నెల రోజుల టైం పడుతుంది అని అప్పట్లో ఆలయ సంపదను కనుగొన్న కమిటీ నిర్ధారించింది. ఇటీవలే పూరి జగన్నాథుడి ఆలయంలో పడయపడ్డ రత్నా బండారిలకు అంటే 100 రెట్లు ఎక్కువ సంపద ఈ ఆలయంలో ఉంది అంటే నమ్మండి. ఇప్పుడు తాజాగా.. ఆలయం కింద ఉన్న ఆ మిస్టరీ గది.. ఆ అనంత పద్మనాభుడి ఆరోవ గది రహస్యమేమిటో తెలుసుకునేందుకు మరో సారి చర్చలు జరుగుతున్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఒపెన్..
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం కింద ఉన్న ఆరు నేలమాళిగల్లో ఐదు గదులను 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి, వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత.. అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఆ బి గది తెరవడం పై.. తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే (ప్రధాన పూజారి) అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది.
ఇక విషయంలోకి వెళ్తే..
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళ లోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. ఆలయ ప్రాంగణంలోని రహస్య గదులు మళ్ళీ వార్తల్లో వచ్చాయి. 2011లో ఆలయ పాలకమండలి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదుల వద్దకు తొలి సారిగా వెళ్లారు. ఆలయం కింద ఉన్న ఆరు నేలమాళిగల్లో.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి, వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ఏ, బీ, సీ గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఆ B గదిపైనే అందరి చూపు..
ఇక అందులో ఆరోవది అయిన ఆ “బి” గదిని మాత్రం తెరవలేదు. దీనిని కూడా తెరవాలంటూ ప్రస్తుతం డిమాండ్లు వస్తున్నాయి. అయితే, దీనిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ట్రావెన్‌కోర్ రాజకుటుంబం, కొంతమంది పూజారులు, భక్తులు 6వ గదిని తెరిస్తే దైవ శాపం తగులుతుందని భావిస్తున్నారు. రాష్ట్రానికి పెను ప్రమాదం సంభవిస్తుందని విశ్వసిస్తున్నారు.
నాగబంధం..
ఈ గది తలుపు మీద పాము బొమ్మ చెక్కబడి ఉంది. అది ఆ తలుపుకి నాగ బంధం ఉంది అని ఆలయ పండితులు చెబుతున్నారు. ఇది ఆ తలుపుకు రక్షణగా ఉన్నదని నమ్ముతారు. ఆ గదిని తెరవాలంటే గరుడ మంత్ర ఉండాలని.. తాంత్రికులు చెబుతున్నారు. గతంలో గదిని తెరిచేందుకు ప్రయత్నించిన పిటిషనర్ అకాల మరణం చెందాడు. దీంతో వారి భయంపెరిగిపోయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో, ఆలయ ఆస్తుల నిర్వహణలో కొన్ని లోపాలున్నాయని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలంటే “బి” గదిని తెరవడం అవసరమని సూచించారు. ఈ గదిలో ఇతర గదుల కంటే ఎక్కువ సంపద ఉండి ఉండవచ్చని చాలామంది నమ్ముతారు. 2020లో సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే అప్పగించింది. “బి” గదిని తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని మాత్రం ఆలయ నిర్వహణ కమిటీకే వదిలేసింది. అది ఒక మతపరమైన సున్నిత అంశమని కోర్టు అంగీకరించింది. స్థానిక పురాణాల ప్రకారం, ఈ గదిని ఒక ప్రత్యేకమైన నాగబంధంతో మూసివేశారని, దాన్ని మంత్రాలను జపించడం ద్వారా మాత్రమే తెరవగలరని అంటారు. ఈ తలుపుకు వెనుక అరేబియా సముద్రంతో సంబంధం ఉందని, దాన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తే కేరళ రాష్ట్రం మొత్తం వరదల్లో మునిగిపోతుందని మరికొంతమంది నమ్ముతున్నారు. ఈ కారణంగా, “బి” గదిని తెరవాలన్న డిమాండ్లు ఉన్నప్పటికీ, మతపరమైన విశ్వాసాలు, పురాణాలు, చట్టపరమైన చిక్కుల కారణంగా అది మూసే ఉంది.