Shooting in Tollywood to be suspended today

టాలీవుడ్‌లో నిలిచిపోయిన సినిమా షూటింగ్‌.. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( Telugu Film Employees Federation ) కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు (strike) పిలుపునిచ్చింది. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లలో పాల్గొంటామని, పెండింగ్ లేకుండా రోజువారీ చెల్లింపులు జరగాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లపై కూడా ప్రభావం చూపనుంది.

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌ (Tollywood) లో నేటి నుంచి షూటింగ్స్ బంద్ (Shootings closed) చేయాలని సంచల నిర్ణయం తీసుకుంది. 30 శాతం వేతనాలు పెంచాలని.. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. వేతనాలు పెండింగ్ పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఇక ఇదే బంద్ టాలీవుడ్ తో పాటు.. ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు (Webseries) కూడా వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇటీవలే ఫిలిం ఛాంబర్‌తో (Film Chamber) జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిన్న లేఖ విడుదల చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని.. ఎవరూ షూటింగ్స్‌లో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది. షూటింగ్స్ ఎక్కడ జరిగిన ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు రూల్స్ ప్రకారం కేవలం 5శాతం మాత్రమే జీతాలు పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. కానీ నిర్మాతలు చెప్పినదానికి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ససేమీరా అంటోంది. 30శాతం పెంచినవారికే షూటింగ్స్‌ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం సెట్స్‌పై ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయం డైరెక్టర్లు, నిర్మాతలకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

ఇక ఇప్పటికే.. శరవేగంగా జరుగుతున్న SSMB 29,OG, ఉస్తాద్ భగత్ సింగ్, వంటి సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం ఉంది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్లు ఇవే..

  1. వేతనాలు పెంపు విషయం లో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లుగా సయ్యద్ హ్యూమయున్ గారిని, వీరశంకర్ గారిని నియమించడం జరిగినది.
  2. తేది: 04-08-2025) 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడమైనది.
  3. సోమవారం నుండి 30% వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ నుండి సంభందిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంభందిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ లకు తెలియజేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్లాలని నిర్ణయించడమైనది.
  4. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్ ల షూటింగ్ లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్ / అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడమైనది.

ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును. ఇతర బాషా చిత్రాలకు కూడా వర్తించును.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *