Schedule released for Vice Presidential election.. When will the election be held..?

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల.. సెప్టంబరు9వ తేదీన జరగనుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. దీని ప్రకారం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇక ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు. సెప్టంబరు 9వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టికల్ 324 ప్రకారం..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఈ కీలకమైన రాజ్యాంగ పదవిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఈ ఎన్నికల ప్రక్రియ ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. నామినేషన్ల పరిశీలన తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఆగస్టు 24వ తేదీ వరకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 9న పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉండనున్నాయి. అదే రోజు అంటే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

అర్హతలు..

  • భారతీయ పౌరుడై ఉండాలి
  • కనీసం 35 సంవత్సరాల వయస్సు
  • రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి
  • లాభదాయక పదవిలో ఉండకూడదు.
  • రిటర్నింగ్ అధికారిగా.. లోక్సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారు.
  • నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు – మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *