భూమి వెలుపల జీవం ఉందా.. మనుష్యుల వంటి ఇతర గ్రహాలు (planets) ఏమైనా ఉన్నారా..? ఈ ఊహ చాలా కాలంగా ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల ఉనికిని క్లెయిమ్ చేసినప్పటికీ, గ్రహాంతరవాసుల (Aliens) రాక గురించి శాస్త్రీయ సమాజంలో చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ.. వాటికి స్పష్టమైన ఆధారాలు ఇంకా లేవు. ఎవరూ వాటిని చూడలేదు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా.. గ్రహాంతరవాసుల కోసం అమెరికన్ అంతరక్ష పరిశోధన సంస్థ (American space agency) నుంచి శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. నిజంగా ఒక వేళ ఏలియన్స్ (Aliens) ఉంటే.. వారు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. భూమిని, మనుషులను చూడటానికి గ్రహాంతర వాసులు భూమిపైకి తరచూ వస్తున్నారని.. ఎంతో మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది నేటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు.

తాజాగా.. గ్రహాంతర వాసుల కోసం నాసా మరో సారి ముందడుగు వేసింది. ఏలియన్స్ ని కనుగొనేందుకు.. కొత్త అంతరిక్ష వాహనం ను రూపొందించనుంది. ఇక విషయంలోకి వెళ్తే.. ‘నాసా’ (NASA) సంస్థ ఈ “న్యూక్లియర్ హెలికాప్టర్” (nuclear helicopter) ను రూపొందించింది. దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. అణు ఇంధనంతో పనిచేసే దీని తయారీకి ఏకంగా 335 బిలియన్ డాలర్లు (రూ.28.75 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. ‘డ్రాగన్ పై’ పేరుతో రూపొందించిన ఈ హెలికాప్టరు 2028లో ప్రయోగించనుంది. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం దీనిని అంతరిక్షంలోకి పంపనుంది.