ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం భారత ఆర్మీ.. “ఆపరేషన్ మహాదేవ్ ” లో భాగంగా జమ్ము కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇక విషయంలోకి వెళ్తే..
ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. శ్రీనగర్ నగరంలోని హర్వాన్ ప్రాంతంలోని దచిగామ్ నేషనల్ పార్క్ ఎగువ ప్రాంతాలలో సోమవారం ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభమైంది. “ఈ ప్రాంతం జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఆపరేషన్‌లో ఉన్న భూభాగం కఠినంగా ఉండటం వలన ఆ ప్రాంతానికి బలగాలను తరలించారు” అని అధికారులు తెలిపారు. భారత సైన్యం, జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు UTలో ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు (OGWలు), ఉగ్రవాద సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని దూకుడుగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.

ఇవాళ జరిగిన ఆపరేషన్ గురించి ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. లిద్వాస్ జనరల్ ఏరియాలో ఉగ్రవాదులతో కాంటాక్ట్ ఏర్పడినట్లు పేర్కొన్నది, ప్రస్తుతం ఆపరేషన్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా.. హర్వాన్‌లోని ముల్నార్ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా బలగాలు సెర్చింగ్ చేస్తున్న సమయంలో కాల్పుల మోత వినిపించినట్లు అధికారులు చెప్పారు. తక్షణమే ఆ ప్రదేశానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ దళాలు వెళ్లాయి. ఉగ్రవాదుల్ని కూంబింగ్ ద్వారా ట్రాక్ చేశారు. ఆ ప్రాంతంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తోంది. మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందిన వారని సమాచారం.