జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడం తో వరద నామ మాత్రం గానే ఉంది. కాగా ప్రస్తుతం ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో ప్రాజెక్ట్ కు వరద (Flood) పొట్టెత్తింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా.. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు 80 వేల క్యూసెక్కులకు పెరిగిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 48,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 34,227 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, నెట్టెంపాడుకు (Nettempadu) 750, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 530, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 200, భీమా లిఫ్టు (Bhima Lift) -2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 45 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Also Read : Kedarnath Yatra | కేదార్ నాథ్ లో ఆకస్మిక వరదలు.. గౌరీ కుండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు..
దీంతో భారీగా వరద నీరు శ్రీశైలానికి పోటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టు (Jurala Project) పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. వర్షాల ప్రభావం ఎక్కువ ఐతే వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 32,932 క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా.. దిగువకు 42,500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల ఇనో ఉండగా.. దిగువకు 43,488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Also Read : Ashok Gajapathi : గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం..
సుంకేసులకు ఇన్..
సుంకేసుల డ్యాంకు శుక్రవారం ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో 7 గేట్లను తెరిచి 34,488 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్ 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
Also Read : Kota Srinivasa Rao | కోట శ్రీనివాస్ చివరి సినిమా పవన్ కళ్యాణ్ తోనే ..!
వేగవంతంగా విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్ : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 345.156 మిలియన్ యూనిట్లు సాధించారు.
Also Read : Tirupati : తిరుపతిలో మహాద్భుతం.. కళ్లు తెరిచిన శివయ్య..