US President Trump's big shock for Indian employees..?

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో (Washington DC) జరిగిన ఒక కృత్రిమ మేధ (AI) సదస్సులో పాల్గొన్న ట్రంప్, అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్‌, (Google) మైక్రోసాఫ్ట్‌ (Microsoft) లాంటి బడా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ (Trump’s warning) ఇచ్చారు. భారతీయులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ, అమెరికన్లకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆ రెండు కంపెనీలపై విమర్శలు గుప్పించారు.

ఇక విషయంలోకి వెళ్తే..

ప్రపంచానికి వరుస షాక్ లు..

ట్రంప్ రెండోసారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ప‌లు షాకింగ్‌ నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. అధికారంలోకి రాగానే జ‌న్మ‌త‌: పౌర‌స‌త్వం ర‌ద్దు, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) (WHO) నుంచి యూఎస్ఏ ఎగ్జిట్‌, ద‌క్షిణ స‌రిహ‌ద్దులో ఎమ‌ర్జెన్సీ (Emergency) వంటి నిర్ణ‌యాల‌తో ట్రంప్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. తాజాగా మరో సారి ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తుంది. అందులో ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ నయా నిర్ణయం..

తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఫెడ‌ర‌ల్ డైవ‌ర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజ‌న్ (DEI) సిబ్బంది అంద‌రినీ సెల‌వుపై వెళ్లిపోవాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే వారంద‌రికీ లేఆఫ్‌లు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రపంచ AI రేసులో అమెరికా స్థానాన్ని బలోపేతం చేయడానికి తన పరిపాలన ప్రణాళికలో భాగంగా అధ్యక్షుడు మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించే అమెరికా టెక్ కంపెనీలు, భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. తన పాలనలో ఆ రోజులు ముగిశాయని హెచ్చరించారు. ఈ మేరకు న్యూయార్క్​లో (New York) జరిగిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్​ సమ్మిట్​లో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.

ఆ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్..

ఈ అంశంపై.. ట్రంప్ ఇలా ప్రసంగించారు. “గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలు విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలి. బదులుగా అమెరికన్లకు అవకాశాలు ఇవ్వాలి. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం కాకుండా అమెరికాలోనే నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వాలి” అని అన్నారాయన. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. అమెరికా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాల రూపకల్పన మీదే దృష్టిసారించాలి. చైనాలో (China) ఫ్యాక్టరీలను కాకుండా.. ఈ నేల మీదే ఏర్పాటు చేయాలి. అలాగే భారత్ కు చెందిన ఐటీ (IT) నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే బదులు ఇక్కడివారికే ఉద్యోగాల ఇవ్వడం మీద దృష్టిసారించాలి” అని ట్రంప్ ప్రసంగించారు.

అమెరికా కాల‌మానం ప్ర‌కారం… ఈ ప్రకటనకు సంబంధించి బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల్లోగా వారంద‌రినీ వేత‌నంతో కూడిన సెల‌వుపై పంపించాల‌ని సంబంధిత ఏజెన్సీల‌కు ఆదేశాలు అందాయి. ఈ విభాగాల‌కు చెందిన అన్ని వెబ్ పేజీల‌ను కూడా ఈ గ‌డువులోగా పూర్తిగా తొల‌గించాల‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు. దీంతో పాటు.. డీఈఐ (DEI) సంబంధిత శిక్ష‌ణ కార్యాక్ర‌మాల‌ను త‌క్ష‌ణ‌మే ముగించాల‌ని ఏజెన్సీల‌కు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాల‌ను కూడా క్యాన్సిల్ చేయాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే కొన్ని వెబ్ సైట్ల‌ను అధికారులు తొలగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *