Fatal accident in Russia.. 50 people killed..!

Russian Plane Crash : రష్యాలో (Russia) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నేడు ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. రాయిటర్స్ ప్రకారం.. 49 మందితో వెళ్తున్న ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. కాసేపటికే అది కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది.

వరుస ప్రమాదాలు..

ఇటీవల కాలంలో.. వరుస విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఫ్లైట్ (Flight ) ఎప్పుడు ఎక్కడ సడెన్‌గా దిగుతుందో, ఏది ఒక్కడ డీ కొంటుందో ఎవరికి అర్థం కావడంం లేదు. తాజాగా రష్యాలో ఘోర విమానం ప్రమాదం సంభవించింది. అంగారా ఎయిర్‌లైన్స్‌ (Airlines) కు చెందిన An-24 ప్యాసింజర్‌ విమానం కూలిపోయింది. ఉదయం అదృశ్యం అయిన విమానం టెండా సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు ఎయిర్ లైన్స్ అధికారులు. విమానంలో సిబ్బందితో సహా దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఘటనలో ప్రయాణికులందరూ చనిపోయినట్లు తెలుస్తోంది.

అహ్మాదాబాద్ మరువక ముందే మరో భారీ ప్రమాదం..

ఇటీవలే భారత్ (India) లోని అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం తర్వాత నుంచి ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విమానంలో ప్రయాణించాలంటే వెణుల్లో వణుకు పుడుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి. అయితే తాజాగా రష్యాలోని అంగారా ఎయర్ లైన్స్‌కు తొలుత అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. గురువారం రోజు ఉదయం బ్లగోవెష్‌చెన్స్క్ నుంచి టిండాకు బయలుదేరిన ఈ విమానం.. గమ్యస్థానానికి చేరుకోకముందే రాడార్ నుంచి అదృశ్యం అయింది. అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 50 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. ఈ ఘటనతో ప్రయాణికుల అంత మృతి చెందడం జరిగింది. దీంతో వాళ్ల కుటుంబ సబ్యలు శోఖ సంద్రంలో మునిగిపోయారు.

గాలింపు చర్యల్లో దొరికిన విమాన శకలాలు..

ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటన స్థంలంలో మంటలు వ్యాపించి ఉండగా.. వాటిని ఆపేందుకు సిబ్బంది పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేశారు. అముర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఎన్-24 విమానం సోవియట్ కాలం నాటి జంట టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది రష్యాలో ముఖ్యంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతీయ విమానాలకు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. పాత మోడల్ విమానం కావడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలపై కూడా నిపుణులు దృష్టి సారిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *