తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాస, భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హాస్యాన్ని పండించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థోమత గురించి వన్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ చక్కిళ్ల వాకబు చేశారు. ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ భార్య, కూతురు స్రవంతి మీడియా ముందుకు వచ్చి భావోద్వేగానికి గురైంది.
స్టార్ కమెడియన్..

గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయనకు 2 లక్షల ఆర్ధి సాయం చేశారట. అయినా కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఈ సారి కచ్చితంగా ఆపరేషన్ చేయ్యాలని లేదంటే ప్రాణాపాయానికి ముప్పు తప్పదని వైద్యులు వెల్లడించారు. ఇక ఫిష్ వెంకట్ ‘గబ్బర్ సింగ్’, డాన్ శీను, అదుర్స్, మిరపకాయ్, వీర, దరువు, సుడిగాడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ‘నాయక్’, ‘డీజే టిల్లు’, ‘ఆది’, ‘బన్నీ’, ‘డీ’, ‘రెడీ’, ‘కింగ్’, వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించారు.
పూర్తిగా క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం..

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించారు. ఆపరేషన్ కి సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ టీమ్ ఆపరేషన్ కి అవసరమయ్యే ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ”కిడ్నీ డోనర్ ఉంటే ఆపరేషన్‌కు సిద్ధం చేసుకోవాలని.. ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తాడని” ఆయన టీమ్ తెలిపినట్లు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి స్వయంగా మీడియాకు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం తాము కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నాన్న బ్లడ్ గ్రూప్ తో తనది మ్యాచ్ కాలేదని, తమ్ముడు ఇద్దామనుకున్నా.. ఆరోగ్య సమస్యలు ఉండడంతో డాక్టర్లు వద్దన్నారని చెప్పింది. అందుకే వేరే డోనర్ కోసం అన్వేషిస్తున్నామని వివరించింది. అయితే ఫిష్ వెంకట్ గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పైనే జీవిస్తున్నారట. కొంతకాలంగా పరిస్థితి మరింత క్షీణించడంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అంతా ఫేక్.. మాకు సంబంధం లేదు..

కాగా ప్రస్తుతం… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఫేక్ న్యూస్ అంటూ ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారుతుంది. అంటే… ఫిష్ వెంటక్ కూతురు చెప్పినట్లుగా ప్రభాస్ టీం నుంచి ఎలాంటి కాల్ రాలేదని అనే వార్త బయటపడింది. అంటే మీడియా లో… ‘హీరో ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు అని.. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి అని.. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ.50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు స్రవంతి తెలిపింది. కానీ ఫిష్ వెంకట్ వైఫ్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరు రాలేదు, ఫోన్ చెయ్యలేదు అని చెప్పారని మరొక వర్షన్ బయటకు వచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్త రచ్చకు దారి తీసింది. ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకునేందుకు ప్రభాస్ టీమ్ ను వివరణ కోరగా అసలు తమ టీమ్ నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటె తాము మీడియా ద్వారా అధికారకంగా తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ప్రభాస్ ఫలానా వారికి వంద కోట్లు ఇచ్చాడని సోషల్ మీడియాలో లేని పోని న్యూస్ క్రియేట్ చేసారని అన్నారు.
Suresh