AI contestants entering Bigg Boss..?

వరల్డ్ వైడ్ గా సహా ఇండియన్ టెలివిజన్ (Television) స్క్రీన్ పై కూడా ఎంతో పాపులర్ అయ్యినటువంటి సెన్సేషనల్ హిట్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇండియాలో మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్‌ మరోసారి హిందీ సహా అన్ని భాషల్లోనూ అలరించేందుకు సిద్దమైంది అయితే ఇప్పటి వరకు ఇండియన్ టీవీ స్క్రీన్స్ దగ్గర అత్యధిక సీజన్స్ హిందీలో జరిగాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ షోకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడూ అక్టోబర్‌లో మొదలయ్యే ఈ కార్యక్రమం ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఆగస్ట్‌లోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. జనానికి బోర్ కొట్టించే విధానాలను పక్కనపెట్టి పూర్తిగా కొత్తగా హిందీ బిగ్‌బాస్ సిద్ధమవుతోంది.

రియాలిటీ షో లో.. కృత్రిమ మనిషి..

బిగ్ బాస్ (Bigg Boss) ఈ పేరు వింటేనే ప్రేక్షకులకు ఎంతో తెలియని ఆనందం వస్తుంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సక్సెస్ అవుతూ దూసుకుపోతుంది. తెలుగులో ఈ కార్యక్రమం 9వ సీజన్ ప్రారంభం కాబోతుండగా, హిందీలో ఏకంగా 19వ సీజన్ ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఈ కార్యక్రమం హిందీలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.. మరి కొద్ది రోజులలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన మొదటి ప్రోమో షూట్ చేయబోతున్నారని సమాచారం. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

UAE చెందిన ఏఐ కంటెస్టెంట్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక ఈ కొత్త సీజన్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది. మరి హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కృత్రిమ కంటెస్టెంట్ ఎవరు? అసలు మేటర్ ఏంటి అనే విషయానికి వస్తే… ఈసారి తారలతో పాటుగా ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) తో నడిచే కొత్త కంటెస్టెంట్ ని కూడా యాడ్ చేయబోతున్నారట. ఇది ఒకింత ఆసక్తి రేకెత్తిస్తుంది. UAE రూపొదించిన మొట్టమొదటి ఏఐ బొమ్మ పేరే హబుబూ (AI Doll Habubu). అయితే ఈ హబుబూ బొమ్మ బిగ్ బాస్ 19 కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియచేశారు. “ఇండియాలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాను.. ఇక నిర్వాహకులు కూడా దీనికి ఒప్పుకునే వరకు మనం ఎదురు చూడాల్సిందే” అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఏఐ కంటెస్టెంట్ రాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

‘హబుబు’..

ఇక ఈ ఏఐ కంటెస్టెంట్ పేరు ‘హబుబు’ (Habubu). అరబ్ దేశానికి చెందిన తరహా భాష, వేషధారణలో ఈ ఏఐ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుందట. ఇది వంట చేయగలదు, క్లీన్ చేయగలదు.. ఇంకా 7 భాషల్లో కూడా మాట్లాడుతుందట. దీంతో హిందీ (Hindi) బిగ్ బాస్ విషయంలో ఈసారి మరింత ఆసక్తి రేగింది. ఇలా ఈ కార్యక్రమంలో హబుబూ పాల్గొని ఇది కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరుగుతాయని చెప్పాలి. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఏఐ కంటెస్టెంట్లతోనే సరికొత్త సీజన్ ప్రారంభానికి కూడా బీజం పడుతుందని చెప్పాలి. మరి హిందీ బిగ్ బాస్ 19 (Bigg Boss 19) లో హబుబూ పాల్గొంటున్నారనే వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు తప్పనిసరిగా ఎదురు చూడాల్సిందే.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *