అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు సమయం ఆసన్నమైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఆ యాత్ర జరగనున్నది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు (సేఏపీఎఫ్) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహరించనున్నారు. అంటే సుమారు 42 వేల మంది భద్రతా సిబ్బంది అమర్నాథ్ రూట్లో విధులను నిర్వర్తించనున్నారు.
ఇది కూడా చదవండి : Xi Jinping : చైనాపై పహల్గమ్ ఎఫెక్ట్..! జిన్ పింగ్ పై చైనా సైన్యం తిరుగుబాటు…?
యాత్ర సర్వం సిద్దం..

జమ్మూకాశ్మీర్ లో హిమాలయపు శ్రేణనుల్లో ఉన్న అమర్నాథ్ యాత్ర కు (Amarnath Yatra) సర్వం సిద్ధం అయ్యింది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయల్దేరి వెళ్లింది. ఈ యాత్రను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఇటీవలే పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడితో నేపథ్యంతో ఈ సారి యాత్రకు ముందు జాగ్రత్తగా..యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రత (tight security) ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.
ఇది కూడా చదవండి : Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!
‘నో ఫ్లై జోన్లు’ గా అమర్నాథ్

ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమర్నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించింది. జులై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్నాథ్ యాత్ర మార్గాలను ‘నో ఫ్లై జోన్లు’గా జమ్ము ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (Shri Amarnathji Shrine Board) ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసులను (Helicopter Service ) రద్దు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని తెలిపింది.
Suresh