ప్రముఖ టీ న్యూస్ (T News) ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్, టీవీ యాంకర్ (TV Anchor), ప్రముఖ జర్నలిస్ట్(Journalist), రచయిత్రి (Writer), వక్త తెలంగాణ ఉద్యమ కారిణి అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్య చేసుకుంది. కాగా ఈమె ఆత్మహత్యపై అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది..? అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ.. శుక్రవారం తన ఇంట్లోనే ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు.. ఆమె మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.
అనుమానాలు…
ఇదిలా ఉంటే… యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ చనిపోయిందా లేదా చంపేశారా అని సందేహాలు వస్తున్నాయి. ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్వేచ్ఛ కాళ్లు బెడ్‌కు తగిలేలా ఉన్నాయి. అంతేకాదు స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఇంట్లో ఎవరున్నారు అనే విషాయాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.
ఆయనే కారణమా…?
ఇక సడెన్ గా స్వేచ్ఛ ( Svechha) మృతి కేసులో… మొట్ట మొదటిగా పూర్ణచందర్ అనే పేరు బయటకు వచ్చింది. పూర్ణచందర్ రావే ఆమె మరణానికి కారణం అని స్వేచ్ఛ తండ్రి చెబుతున్నాడు. స్వేచ్ఛ మొదటి భర్తతో 13ఏళ్ల కుమార్తె ఉంది. స్వేచ్ఛ మొదటి భర్త కిరణ్‌కు ఐదేళ్ల క్రితం విడాకులు సైతం ఇచ్చింది. కొన్నేళ్లుగా పూర్ణచందర్ అనే ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. ఆమె 3 రోజుల కిందటే పూర్ణచందర్‌తో అరుణాచలం వెళ్లివచ్చింది. పూర్ణచందర్, స్వేచ్ఛ మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె తండ్రి అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్వేచ్ఛతో మాట్లాడానని ఆమె తండ్రి చెప్పాడు.
మూడేళ్లుగా హింసిస్తున్నాడు -స్వేచ్ఛ తండ్రి
ఆ సమయంలో పూర్ణచందర్‌తో విడిపోతున్నానని ఆయనకు చెప్పిందట. కాగ నిన్న రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచందర్‌కు ఇతర మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని- స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. స్వేచ్ఛకు పూర్ణచందర్ అఫైర్స్ గురించి చెప్పినా వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. పూర్ణ చందర్‌కు (Poorna Chandra Rao) పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు. అతను నా కూతుర్ని మూడేళ్లుగా హింసిస్తున్నాడని -స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతానికి ఇవి ఆరోపణులు గానే ఉన్నాయి. పూర్ణ చందర్ రావు తో సంబంధం ఉన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి కొన్ని రోజులు అయితే తప్ప…. ఆమె మరణంపై సరైన క్లారిటీ రావడం కష్టమే. ఏది ఏమైనా… ప్రస్తుతం స్వేచ్ఛ మరణంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.