What does TMC and cusec mean? Do you know the meaning of these words?

TMC, క్యూసెక్… ఈ పదాలను వార్తల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ, మీరు తరుచు వినే ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఇక ఆ వరద నీరు అంతా నదుల రూపంలో… డ్యాంలో కి గానీ, రిజర్వాయర్ లోకి గానీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ప్రాజెక్టులో నీరు భారీగా చేరడం, వాటిని టీఎంసీల ప్రాదిపదికన దిగువకు వదులుతున్నారు. మరో అంశంలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి తగదాల్లో మాకు ఇన్ని టీఎంసీల నీరు కావాలని డిమాండ్ చేస్తుండటం కూడా మనం చాలా సార్లు వినే ఉంటాం. జీవకోటికి ప్రాణాధారమైన నీటిని కొలిచే ప్రమాణం టీఎంసీ. అసలు టీఎంసీ అంటే ఏమిటీ, దానికి ఉపపదం గా వాడే క్యూసెక్కులు అంటే ఏంటో ఈ స్టోరీ చదివేయండి.

TMC, క్యూసెక్… అంటే ఏంటో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు భారీగా ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయి. దీంతో ఆ వరద నీరు అంతా ప్రాజెక్టులకు చేరడంతో… డ్యాం లన్ని కూడా నిండు కుండ‌లా మారుతున్నాయి. న‌దుల‌కు, ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడ‌ల్లా టీఎంసీ, క్యూసెక్కు అనే ప‌దాలు వాడుతూనే ఉంటారు. నీటి నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి మాట్లాడితే క్యూసెక్కులలో చెప్పాలి.

TMC అంటే ఏమిటి..?

ఇక విషయంలోకి వెళ్తే… టీఎంసీ (TMC) : రిజర్వాయర్లలో, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం టీఎంసీలలో చెబుతుంటారు. అంటే నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్‌ కట్ పదాన్ని ఉపయోగిస్తారు. టీఎంసీ (TMC) అంటే “వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు” (Thousand Million Cubic Feet ). అంటే వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, అని అర్థం. లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపు 2,881 కోట్ల లీటర్లు (ఘనపుటడుగులు) ఉంటుంది. దాదాపు 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఒక్క అడుగు నీరు చేరితే అది ఒక్క టీఎంసీకి సమానంగా పరిగణించవచ్చు. ఇక క్యూసెక్కు అంటే సెక‌ను కాలంలో ప్ర‌వ‌హించే ఘ‌న‌పుట‌డుగుల నీరు అని అర్థం. CUBIC FEET PER SECOND అని అర్థం. ఒక సెక‌ను వ్య‌వ‌ధిలో ఘ‌న‌పుట‌డుగుల నుంచి ప్ర‌వ‌హించే నీరు 28 లీట‌ర్లు. ఏదైనా ఒక రిజ‌ర్వాయరు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంట‌ల పాటు ప్ర‌వ‌హిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది.

కొట్ల TMC లు వృధా…

ఇక తెలుగు రాష్ట్రాల్లో తాగు, సాగు నీటి కోసం వాడే నీటి పరిణామం కేవలం 2 నుంచి 3 వేల టీఎంసీల లోపే ఉంటుంది. కాని ప్రాజెక్టుల నిర్మాణం, స్టోరేజీ కెపాసిటీ లేక మనం వాడుకునే టీఎంసీల నీటి కంటే , కొన్ని రెట్ల టీఎంసీల నీటిని మనం సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్నాం. ఈ నీటిని కూడా ఒడిసిపట్టుకుంటే, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. దీనికి కావల్సిందల్ల రాజకీయంగా నిర్ణయాలు, అందుకు తగ్గట్టుగా చిత్తశుద్ది ఉండాలి. ఇంకా చెప్పాలంటే… తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న కృష్ణా, గోదావరి నదిపై ఇంకా కొన్ని డ్యాం లను సైతం కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో కాళేశ్వరం గోదావరి నీటిని ఒడిసి పడుతుంది. ఇక ఏపీలో పోలవరం పూర్తి అయితే.. మరో 100 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు త్రాగు, సాగు కు ఎలాంటి ధోకా లేదు అనే చెప్పాలి.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *