- మిత్రులే శత్రువులైతే…
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రం…
- రక్తాలు చిందిస్తున్న రెండు దేశాలు..
- దేశ సరిహద్దులనే పంచుకుని దేశాల మధ్య యుద్ధం ఎందుకు..?
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అసలేందుకు ఈ శత్రుత్వం..?
- 50 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది..?
- ఈ 50 ఏళ్లలో అగ్నికి ఆజ్యం పోసింది ఏంటి..?
- అసలు ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఏంటి..?
ప్రాణ స్నేహితులే శత్రువులైతే… మన అనుకున్న వాళ్లతోనే మంటలు పుడితే.. ఇక అలాంటి యుద్దాలనే చరిత్ర గుర్తుంచుకుటే.. ఏం జరుగుతుంది. అవును చరిత్ర గుర్తించుకునేది అలాంటి యుద్దాలనే. మీకు మహా భారతం గుర్తుకు ఉంటే ఉంటుంది. అలనాటి మహా భారతం (Mahabharata) కురుక్షేత్రం (Kurukshetra) నుంచి చరిత్ర పేజీలు తిరగేసిన ప్రతి సారి ఇలాంటి యుద్దాలు ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి కూడా… ఇక ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్ (Iran – Israel) మధ్య కూడా అలాంటి సమరమే జరుగుతోంది. ఇరు దేశాలు… ఎంత వరకైనా ఎన్ని రోజులైనా తగ్గేదేలే అంటు యుద్దానికి సై అంటున్నాయి.
ఆపరేషన్ రైజింగ్ లయన్ (Operation Raising Lion) అంటూ ఇజ్రాయిల్ (Israel) దాడి చేస్తే ట్రూ ప్రామిస్త్రీ 3 పేరుతో ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో మంటలు చేలరేగాయి. అసలు ఈ రెండు దేశాల పంచాయితీ ఏంటీ…? ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న దేశాలు ఇప్పుడేందుకు భర్త శత్రువులా అయ్యాయి. ఎందుకు తుపాకులు దూసుకుంటున్నాయి. ఎందుకు మిసెల్స్ తో ఎక్కుపెట్టుకుంటున్నాయి. అసలు దేశ బార్డర్లే పంచుకోని దేశాల మధ్య యుద్దం ఏందుకు వచ్చింది…? 50 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది…?
ఇది కూడా చూడండి : Japan : జూ 5న మహా ప్రళయం.. జపాన్ ను ముంచెత్తనున్న భారీ సునామీ…
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి…?

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తలు పీక్స్ కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్దం ఎందుకు స్టార్ట్ చేసిందో కూడా ముందే చెప్పేసింది. ఇరాన్ అణు ఆయుధాన్ని తయారుచేయకుండా నిరోధించేందుకే ఈ వైమానిక దాడులను ప్రారంభించాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్ (Iran), అమెరికా మధ్య కొత్త దౌత్య ఒప్పందం కుదిరే అవకాశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే, ఈ చర్చల కోసం తాను నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాతే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరో వైపు… మధ్యప్రాచ్యానికి అమెరికా (America) మరిన్ని యుద్ధ విమానాలను పంపుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణలో అమెరికా పాత్రపై అధ్యక్షుడు ట్రంప్ (Trump) చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి. సోషల్ మీడియాలో “బేషరతుగా లొంగిపోవాలి” అని ఇరాన్‌ను డిమాండ్ చేస్తూ ట్రంప్ పోస్ట్ చేశారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను చంపే ప్రణాళికలు లేవని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో తాజా పరిస్థితిపై చర్చించినట్లు వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. జూన్ 2025న ఇజ్రాయెల్ ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (Operation Rising Lion) ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సైనిక చర్య ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ భద్రతకు ఉన్న ముప్పును తొలగించే ఉద్దేశంతో జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అసలు ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఇది కూడా చూడండి : Plane crash, Bhagavad Gita : విమాన ప్రమాదంలో… చెక్కు చెదరని భగవద్గీత
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అంటే ఏమిటీ…?

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అనేది ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇరాన్ యొక్క అణు స్థావరాలపై చేపట్టిన ఒక లక్ష్యస్థాన దాడి. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించేందుకు ఖచ్చితమైన మిస్సైళ్ల దాడులు నిర్వహించింది. రాజధాని టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని పలు కీలక అణు సౌకర్యాలు (Nuclear facilities) ఈ దాడుల లక్ష్యంగా ఉన్నాయని సమాచారం. ఈ చర్య ఇరాన్‌ను దీర్ఘకాలంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నట్లు ఆరోపిస్తూ, దాని సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో జరిగిందని IDF ప్రతినిధి బిజి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.
ఇది కూడా చూడండి : Gaza Economic Crisis : గాజాలో ఆకలి కేకలు!
నువ్వా నేనా…
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక ఇప్పటికే ఆరుగురు టాప్ ఇరాన్ ఆర్మీ కమాండర్లను సైతం ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని..దీనికి తప్పకుంటా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. ఇక ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపాలని ఇజ్రాయెల్ కోరగా.. వైమానిక దాడికి తగిన సమాధానం ఇవ్వాలని ఇరాన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. అసలు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటే ఏమిటి..? ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ ఈ పేరు ఎందుకు పెట్టిందో తెలుసుకుందాం. రండి.
భీకర యుద్ధం…

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం (war) నడుస్తుంది. మూడో ప్రపంచ యుద్దానికి (Third World War)ఈ రెండు దేశాలే నాంది పలుకుతాయని కూడా ప్రపంచ దేశాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పై దాడి చేయడంతో తానికి ప్రతి దాడిగా.. ఇజ్రాయెల్‌పై ఆపరేషన్ ‘ట్రూ ప్రామిస్ 3’ని (True Promise 3) ప్రారంభించింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించి ఇరాన్‌పై వైమానిక దాడులు చేయడంతో.. ఇరాన్ కూడా ‘ట్రూ ప్రామిస్ 3’ అనే సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించి ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ యుద్దంలో ఫ్రాన్స్, బ్రిటన్ (Britain), అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇక ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ కు భారత్ బద్దతు ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. ఇరాన్ పై రష్య, చైనా (China) దేశాలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఇప్పటికే రష్యాతో (Russia) చర్చలు జరిపింది. రష్యా ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలకు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పై బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు.
ఇది కూడా చూడండి : 200-year-old condom : 200 ఏళ్ల నాటి కండోమ్… ఇది వాడితే స్వర్గమే..!
Suresh