Hunger cries in Gaza! The price of that biscuit is Rs. 3000, the price of sugar is Rs. 5000

Gaza Economic Crisis : గాజాలో ఆకలి కేకలు!

  • గాజాలో ఆకలి కేకలు..
  • యుద్ధంతో గాజాలో ఆర్థిక సంక్షోభం…
  • పార్లే-జీ ధర ఎంతో తెలిస్తే… మీకు దిమ్మ తిరగాల్సిందే
  • ఒక్క బిస్కెట్ ధర 2300..?
  • భారత్ లో రూ.5 బిస్కెట్ ప్యాకెట్ అక్కడ రూ.2300 పైనే
  • యుద్ధంతో గాజాలో ఆహార సంక్షోభం ఏర్పడిందా..?
  • సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర సరుకులు
  • ఇక్కడ 5, 10 కి దొరికేది… అక్కడ 2 నుంచి 4 వేలకు పై మాటే

మన దేశంలో ప్రతి ఇంట్లోనూ ఈ బిస్కేట్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ బిస్కెట్ తిన్నవాళ్లే. చాయ్ లో వేసుకొని, చాయ్ లేకపోతే నీళ్లలో వేసుకోని తినే ఉంటారు. ఇక తక్కువగా, చౌకగా లభించే తినుబండారాల్లో పార్లే బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు (drought) కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లే-జీ బిస్కెట్లు (Parle-G Biscuits) వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక ధరకు అమ్ముడవుతుండటం గమనార్హం.

యుద్ధం వద్దు… శాంతి ముద్దు…

యుద్ధం (war) వద్దు.. శాంతి ముద్దు అని అనుకుంటాం.. నిజానికి యుద్ధాన్ని ఎవరు కోరుకోరు. తప్పని పరిస్థితిలో తప్పా… అంతెందుకు యుద్ధం వద్దు, శాంతి ముందు అని, శాంతి పావురాలు ఎగురవేసే భారత్ కూడా యుద్దం చేయాల్సి వచ్చింది. అవును ఇటీవల ఇండియా (India) కూడా.. పాకిస్థాన్‌ (Pakistan) తో చిన్న యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. ఐతే.. ఈ యుద్ధాల వల్ల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య పేద ప్రజలు.. ఆకలితో అలమటిస్తాయి. గత మూడేళ్ల కిందట మొదలైయిన రష్యా – ఉక్రెయిన్ యుద్దం సైతం ఇలాగే ఉంది. ప్రపంచంలో రెండు వాణిజ్య దేశాల మధ్య యుద్దం జరిగితే.. ఆ ప్రభావం యావత్ ప్రపంచ పైన పడింది. అందో భారత్ సైతం ఉంది. అవును ఉక్రెయిన్ (Ukraine) యుద్దం వల్ల భారత్ లో వంట నునె దిగమతులపై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో అప్పట్లో భారత్ లో నూనె ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం ఆ వంతు గాజా వచ్చింది అనే చెప్పాలి. అవును ప్రస్తుతం గాజా లో పరిస్థితులు దయనీయంగా మారాయి.

ఆకాశాన్ని తాకిన నిత్యావసర సరుకులు…

గాజా (Gaza) ప్రాంతంలో ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం కారణంగా సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యలు నిత్యవసర సరుకులు కొనాలంటే, వెన్నులో వనుకు పుడుతుంది. భారతదేశంలో సాధారణంగా రూ.5కి లభించే పార్లీ-జీ బిస్కెట్ (Parle-G Biscuit) ప్యాకెట్ గాజాలో రూ.2,300 నుంచి రూ.2,400 వరకు ఉంది. అలాగే ఒక కేజీ చక్కెర ధర రూ.5,000కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదలకు చాలా కారణాలున్నాయి. ఇజ్రాయెల్-హమాస్.. గాజాలో జరుపుతున్న యుద్ధం వల్ల అక్కడ ఆహార సంక్షోభం (Food crisis) ఏర్పడింది. నిరంతర యుద్ధం సమస్యగా మారింది. ఇజ్రాయెల్ (Israel) .. పాలస్థీనా (Palestine) పై అనేక ఆంక్షలు విధించింది. ఇక బ్లాక్ మార్కెట్ (Black market) సైతం ఇదే అదునుగు చూసుకోని సరుకుల కృత్రిమ కొరతను సృష్టిస్తోంది.

ఇక్కడ రూ. 50… అక్కడ రూ.5000…

నిజానికి… భారతదేశంలో పంచదార ధర ఎంతంటే ఏం చెబుతారు. ఎంత అంటే యావరేజ్‌గా కేజీకి రూ.40-50 ఉంది. 40 నుంచి 50 ఉంటుంది. ఉప్పు రూ.15-20, శనగపప్పు వంటి పప్పులు రూ.100-150, నూనెలు లీటరుకు రూ.100-200, కూరగాయలు కేజీకి రూ.20-80 మధ్య ఉంటాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) 2023 అక్టోబర్ 7 నుంచి కొనసాగుతోంది. రోజు రోజుకు ఆ దేశం ఆహారం, ఆర్ధిక సంక్షోభ (Financial crisis) దిశగా జరుకుంటుంది. దీంతో గాజాలో మాత్రం ఈ సరుకుల ధరలు భారత ధరలతో పోలిస్తే వందల రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక కేజీ ఉప్పు గాజాలో రూ.1,000కి పైగా ఉంది. పప్పులు రూ.2,000-3,000 దాకా ఉన్నాయి. నూనెలు రూ.3,000-5,000, కూరగాయలు రూ.500-2,000 మధ్య ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఉత్తర గాజాలో ధరలు అధికంగా ఉన్నాయి.. ఒక కిలో చక్కెర రూ. 4,914, ఒక లీటర్ వంట నూనె రూ. 4,177, ఒక కిలో బంగాళాదుంపలు రూ. 1,965, ఒక కిలో ఉల్లిపాయలు రూ. 4,423, ఒక కప్పు కాఫీ రూ. 1,800గా ఉన్నాయి.

గాజాలో మృత్యుఘోష…

దీంతో గాజా ప్రజల జీవన పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ యుద్ధంలో 53,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. 1,19,648 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ విధించిన కండీషన్ల వల్ల ఆహారం, నీరు, మందులు, ఇతర నిత్యవసర సరుకులు గాజాకు చేరడం లేదు. ఈ పరిస్థితి 10 వారాలుగా కొనసాగుతోంది. దీనివల్ల 5,00,000 మంది పస్తులతో బాధపడుతున్నారని ఐక్య రాజ్య సమితి హెచ్చరించింది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 50శాతం మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు. చాలా మంది గుడారాల్లో నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆహారం కోసం ప్రజలు తీవ్రంగా పోరాడుతున్నారు. కొందరు వేరే దిక్కు లేక, సముద్ర నీటిని తాగడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు.

2023 నుంచే విధ్వంసం మొదలు…

ఇక 2023 అక్టోబరులో ఉద్రిక్తతలు పెరిగి, ఆ తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య (military action) ప్రారంభమైనప్పటి నుంచి గాజాకు ఆహార సరఫరా క్రమంగా తగ్గిపోయింది. ఈ ఏడాది మార్చి 2 నుంచి మే 19 మధ్య, ఈ పాలస్తీనియన్ ప్రాంతం దాదాపు పూర్తి దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. ఈ యుద్ధం సామాన్యుల జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తోంది. ఆసుపత్రుల్లో కూడా సరిపడా సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. 14,000 మంది పిల్లలు పస్తుల కారణంగా ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు, గాజా మీద దాడులు, కండీషన్ల కారణంగా సామాన్య ప్రజలు ఆహారం, నీరు, ఆశ్రయం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. UNO వీళ్ల ముగింపుకు ఏలా సహకరిస్తుందో వేచి చూడాలి.

Suresh


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *