సాధారణంగా… ప్రాచీన వస్తువులు ప్రదర్శనలో ఉంచడం సర్వసాధారణం. అంటే యూరప్ పిరమిడ్ లో ఉన్న మానవ అవశేషాలు గానీ, గిన్నెలు గానీ, లేదంటే అప్పటి వాడుక వస్తువులు గానీ ఇలా మ్యూజియం (Museum) లో ప్రదర్శించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చూడబోయే వస్తువును గతంలో ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు అనే చెప్పాలి. అసలు దీన్ని ఎవరు ప్రదర్శిస్తారు అనికూడా అనుమానం వస్తుంది. మరి ఏంటి ఆ వస్తువు.. ఆ వస్తువులతో ఏం చేస్తారు అని అంటారు… అయితే ఆగండి అక్కడికే వస్తున్నా…
ప్రాచీన కండోమ్ చరిత్ర…

ప్రత్యేకమైన మరియు అరుదైన వస్తువుల ప్రదర్శనలు సర్వసాధారణం అయినప్పటికీ, 200 ఏళ్ల నాటి కండోమ్ నెదర్లాండ్స్ (Netherlands) లోని రిజ్క్స్ మ్యూజియంలో ప్రదర్శించబడింది మరియు దృష్టిని ఆకర్షించింది. ఈ కండోమ్ లైంగిక భద్రత చరిత్రను వెల్లడి చేయడమే కాకుండా, 19వ శతాబ్దపు సాంస్కృతిక మరియు కళాత్మక కోణాలను కూడా వెల్లడిస్తుంది.
మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్ ( condom) గురించి. అవును మీరు విన్నది నిజమే. మనం నిజంగా ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది 200 ఏళ్ల నాటి కండోమ్ గురించే. సుమారు 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్ తాజాగా దర్శనమిచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో ఈ పురాతన కండోమ్ ను ప్రదర్శించారు. శృంగార (romantic) కళాకృతులతో అలంకరించిన ఈ కండోమ్ 1830 నాటిదని గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి! అవును… సుమారు 200 ఏళ్ల నాటి కండోమ్ తాజాగా ప్రదర్శనకు వచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియం (Rijksmuseum) లో దీనిని ప్రదర్శనకు ఉంచారు. దీనిని గొర్రెల పేగు ద్వారా తయారు చేసినట్లు భావిస్తున్నారు. దీనిపై ఉన్న చిత్రాన్ని ఒక సన్యాసిని, ముగ్గురు మతాధికారులు సూచించేదిగా భావిస్తున్నారు. కాగా ఈ కండోమ్ కి ఓ కండోమ్ చరిత్ర కూడా ఉంది.
19వ శతాబ్దపు కండోమ్…

దీంతో… 19వ శతాబ్ధంలోనే లైంగికత, గర్భనిరోధకం (Contraception) పై ప్రజలకు ఉన్న అవగాహనను ఇది తెలియజేస్తోందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రిజ్స్క్ మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ స్పందిస్తూ… ఈ కండోమ్ ను యూవీ కాంతితో తనిఖీ చేస్తే.. అది ఉపయోగించబడలేదని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఇక దీన్ని పరిశీలించగా… ఇది మంచి స్థితిలోనే ఉందని ఆమె అన్నారు. ఇదే సమయంలో… దీనిని ప్రదర్శనకు ఉంచినప్పటి నుంచి మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని.. ప్రతిస్పందన అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కండోమ్ ఫ్రాన్స్ లోని ఒక వేశ్యాగృహం నుంచి వచ్చిన లగ్జరీ సావనీర్ అని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
కండోమ్ వేలం ఎంతంటే…?

ఇక అసోసియేటెడ్ ప్రెస్, ది గార్డియన్ నివేదించినట్లుగా… దీనిని నవంబర్ 2022లో హార్లెమ్లో జరిగిన వేలంలో 1,000 యూరోలకు కొనుగోలు చేశారు. ఆ సమయంలో, కండోమ్లు జంతువుల చర్మం, తాబేలు షెల్ లేదా నారతో తయారు చేయబడ్డాయి. కానీ అవి సిఫిలిస్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి పూర్తిగా సురక్షితం కాదు. 1839లో వల్కనైజ్డ్ రబ్బరు ఆవిష్కరణతో కండోమ్లు మరింత ప్రభావవంతంగా మారాయి. ఇక మరో వైపు తమ సంస్థ ఈ కళాఖండాన్ని ఇతర మ్యూజియంలకు అద్దెకు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే.. ఈ కండోమ్ చాలా సున్నితంగా ఉందని అన్నారు. ఇది నవంబర్ చివరి వరకూ ప్రదర్శనలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Suresh