Hero Sidhu Jonnalagadda, who gave a return of 4 crores with the disaster of Jack movie

Sidhu Jonnalagadda : మంచి మనసు చాటుకున్న టిల్లు బాయ్…

టాలీవుడ్ లో మంచి మనసు చాటుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వాళ్ల మంచి మనసును చాటుకుంటు మీడియా ముందు కంటపడుతారు. అంతో మరో యువ హీరో జాన్ అయ్యారు. నిజానికి ఓ సినిమా ఫ్లాప్ అయితే, దాని బాధ్యతను హీరోలు తీసుకోవడం మామూలుగా జరిగే విషయం కాదు. కానీ కొందరు మాత్రం నిర్మాతలపై భారం పడకుండా మనసు పెట్టి ఇలా చేస్తుంటారు. అలాంటి వారిలోకి తాజాగా చేరాడు డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ.

టాలీవుడ్ లో టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ స్టార్ బోయ్ గా మారిపోయారు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ కూడా తెగ ఆడేసింది. దాంతో త‌న ఇమేజ్ డ‌బుల్ అయ్యి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇటీవలే సిద్ధూ నటించిన తాజా చిత్రం “జాక్” బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ సినిమాతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ బాగా న‌ష్ట‌పోయారు. ఇప్పుడు ఆ న‌ష్టాన్ని కాస్త‌లో కాస్త భ‌ర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు టిల్లు. త‌న పారితోషికం నుంచి రూ.4 కోట్లు వెన‌క్కి ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం మొత్తంగా రూ.8 కోట్లు అందుకొన్నాడు సిద్దు. అందులో స‌గం రిట‌ర్న్ ఇచ్చాడ‌న్న‌మాట‌. నిజంగా ఇది మంచి విష‌యం. ప్ర‌స్తుతం సిద్దు ‘తెలుసు క‌దా’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. నీర‌జ కోన ద‌ర్శ‌కురాలు. రాశీఖ‌న్నా, శ్రీ‌నిధి శెట్టి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అక్టోబ‌రు 17న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

నిర్మాతలను అదుకోండి…!

గతంలో ఎప్పటి నుంచో నిర్మాతలు న‌ష్ట‌పోయిన‌ప్పుడు హీరోలు పారితోషికాన్ని తిరిగి ఇవ్వాల‌ని, వాళ్ల‌ని ఆదుకోవాల‌న్న డిమాండ్ గ‌ట్టిగానే వినిపిస్తుంటుంది. అలా చేస్తున్న వాళ్లో బయటకు కనిపించని వాళ్లో చాలా అరుదుగా ఉంటారు. టాలీవుడ్ లో ఇలా రెమ్యూనరేష్ తిరిగి ఇచ్చే వాళ్లల్లో చాలా అరుదుగా ఉంటారు. అందులో… ముందుగా ఉండేది.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవి తేజ వంటి హీరోలు ఉన్నారు. కాగా ప్రస్తుతం వారి సరసన టిల్లు బాయ్ కూడా చేరారు. నిజానికి… ఇలా చేయ్యడం చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. ఇలాంటి యంగ్ స్టర్స్ అలా చేయడం వల్ల కొత్త నిర్మాతలకు కూడా కొంత ధైర్యం వస్తుంది. కాకపోతే కంటెంట్ విషయంలో అందరూ కలిసి ముందే సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ తప్పిదాలు జరగవు. అప్పుడు ఎవరూ ఎవరికీ ఏ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఇండస్ట్రీలో ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దంటే ముందుగా నిర్మాత‌ని గ‌ట్టెక్కించ‌డానికి ఇలా వెన్నుద‌న్నుగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో సిద్దుని అభినందించాల్సిందే.

Suresh