ఈ భూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ది అగ్రస్థానం. ఇందులో భారత్ పొరుగు దేశం అయిన చైనాను సైతం దాటింది. కానీ అధిక జనాభాతో పాటు దేశంలో HIV బాధితులు సంఖ్య సైతం అంతకు అంతకు పెరిగిపోతున్నారు. HIV బాధితులు కల్గిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. కాగా ఇటీవలే ఓ రిపోర్ట్ లో తెలుగు రాష్ట్రాల SEX వర్కర్స్ గురించి విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి.
HIV లో టాప్…

ఇండియాలో మరోసారి HIV కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన దేశాల్లో భారత్ 3 స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా… మొత్తంగా 2.3 మిలియన్ల మంది హెచ్ఐవీతో బాధ పడుతుండగా.. ఈ సంఖ్యను తగ్గించేందుకు సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు హెచ్ఐవీ బాధితుల సంఖ్య తెలుసుకునేందుకు తాజాగా ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (PMPSE) అధ్యయనం చేసింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యధిక మహిళా సెక్స్ (Sex) వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని తేలింది.
దేశంలో వ్యభిచార వృత్తిలో నిమగ్నమైన మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనా తీతం. వ్యభిచారమే జీవనాధారంగా జీవిస్తున్న మహిళల సంఖ్య తగ్గకపోగా, స్పా, మసాజ్ సెంటర్లు, పబ్‌లు, బార్లు, ఫామ్ హౌస్‌లు, ఓయో రూమ్‌ల కల్చర్ కారణంగా సెక్స్ వర్కర్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (PMPSE) నిర్వహిం చిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అత్యధికంగా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాలు ఇవే…

దేశంలో అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు (Sex Workers) ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) టాప్-5లో నిలిచాయి. దేశవ్యాప్తంగా మొత్తం 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా వేయగా, కర్ణాటక (karnataka) (15.4%) మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (12%) రెండో స్థానంలో, మహారాష్ట్ర (9.6%) మూడో స్థానంలో, ఢిల్లీ (8.9%) నాలుగో స్థానంలో, తెలంగాణ (7.6%) ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక PLOS గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. 32 రాష్ట్రాల్లో 651 జిల్లాలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ప్రదీప్ కుమార్ నేతృత్వంలో PMPSE సర్వే నిర్వహించగా.. దేశమంతటా 642 జిల్లాల్లో FSWలు ఉన్న 43,579 హాట్స్పాట్లను గుర్తించింది. వాటిలో 34 జిల్లాల్లో 5,000 కంటే ఎక్కువ FSWలు ఉన్నారు. APలో 5 జిల్లాలు, తెలంగాణలో 6 ఉన్నాయి. తెలంగాణ అత్యధికంగా FSWలున్న హాట్స్పాట్లున్నట్లు రికార్డ్ చేశారు. జాతీయంగా ప్రతి రాష్ట్రంలో సగటున 8 FSWల హాట్స్పాట్లున్నట్లు గుర్తించారు. ఇళ్లు, ఆఫీసులు, తదితర ప్రాంతాల్లో పనులు చేసే చోట 55.1% లైంగిక సంబంధాలు కలిగివున్నట్లు PMPSE సర్వే వెల్లడించింది. 14% ఫిమేల్ సెక్స్ వర్కర్స్ 10,718 నెట్వర్క్ ఆపరేటర్ల ద్వారా దందా నడిపిస్తుంటే.. 9% మంది లింక్ వర్కర్ స్కీమ్ (లోకల్ సెక్స్ వర్కర్స్) ద్వారా ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. తెలంగాణలో 568 మంది మ్యాప్డ్ నెట్వర్క్ ఆపరేటర్లు ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అలాగే తెలంగాణలోని ప్రతీ హాట్‌స్పాట్‌లో 25 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు సర్వేలో తెలిపింది. ఇది కూడా దేశంలో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీలో 24 మంది, గుజరాత్లో 21 మంది, మహారాష్ట్రలో 20మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 96 వేల 193 మంది ట్రాన్స్జెండర్లు సెక్స్ వర్క్ చేస్తుండగా.. 90.8 శాతం మంది హాట్స్పాట్లలోనే ఉన్నట్లు సర్వేలో వెల్లడి అయింది. ఇక APలో ప్రతి గ్రామంలో LWS సగటున 10 FSWలు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఇక పురుషులతో సగటున 25 మంది లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు.
సెక్స్ వర్కర్స్ లో స్త్రీ లేనా… పురుషులు లేరా..?

ఇక ఇదిలా ఉంటే సెక్స్ వర్కర్స్ లోకి పురుషు సైతం ఉన్నారు. పురుష సెక్స్ వర్కర్లలోనూ తెలంగాణనే టాప్‌లో నిలిచింది. హాట్‌స్పాట్‌కు 50 మంది పురుష సెక్స్ వర్కర్లు ఉండగా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో 29 మంది, గోవాలో 27 మంది ఉన్నారు. ఇక పురుష సెక్స్ వర్కర్ల జనాభాలో ఏపీలో 6.3 శాతం మంది ఉన్నారు. తెలంగాణలో ఈ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. హాట్స్పాట్లలో ఉన్న పురుష సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉండి ఆందోళన కల్గిస్తోంది.
Suresh