Do you know why jeans have small pockets?

జీన్స్… చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ధరించే సౌకర్యవంతమైన ఈ జీన్స్ (Jeans pants). ఇక జీన్స్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ (stylish look) చాలా అందంగా ఉంటాయి. దీనికి వయసుతో పని లేదు, లింగంతో పనిలేదు. స్త్రీ, పురుషులందరు కూడా సింపుల్ గా వేసుకునే, స్లింగ్ కనిపించేస్తుంది ఈ జీన్స్ తో.. ఇక చాలా మందికి ఈ జీన్స్ ఫేవరెట్ అనే చెప్పాలి. యువతలో చాలామంది రోజూ జీన్స్ వేసుకోవడానికే ఇష్టపడతారు. అయితే, జీన్స్‌కు కుడి వైపున మినీ పాకెట్ ఉంటుంది. పెద్ద జేబు లోపల ఈ చిన్న జేబు ఎందుకుంటుందో రోజూ జీన్స్ వేసుకుంటున్నా చాలామందికి తెలియదు. చిన్న పిల్లలు అయితే.. ఆ జేబుదొంగ జేబు అని ఫన్నీగా చెప్పుకుంటారు. ఇక కాస్త పెద్ద వాలు అయితే ఇది సీక్రేట్ జేబు అని అంటుంటారు. మరి నిజంగా ఆ జేబు కథ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం యువతి, యువతల్లో చాలా మందికి ఫ్యాషన్ ట్రెండ్స్ (Fashion trends) ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. ఏ సమయంలో ఏ ట్రెండ్ వచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ఫ్యాషన్ మాత్రం ఇట్టే ట్రెండ్ అయిపోతుంది. అలా వచ్చిన ఫ్యాషన్ ఈ జీన్స్. ఎప్పుడో కొన్ని ఏళ్ల కిందట వచ్చిన ఈ ఫ్యాన్స్ ఇప్పుటికి యుత్ కి ఆల్ టైం ఫేవరెట్ స్టైల్. ఇక సమాజంలో… స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ జీన్స్ ధరించడానికి ఇష్టపడతారు. పేద ధనిక, యుక్త వయసు నుంచి ముసలి వాళ్లు సైతం ఈ దుస్తులు దరిస్తుంటారు. మరి ఎక్కువగా ఫారెన్ కంట్రీల్లో యువత కన్న, ముసలి వాళ్లే అధికంగా జీన్స్ వాడకం వినియోగిస్తున్నారు. ఇక మీరు కొన్న జీన్స్‌కు చిన్న జేబులు ఉండటం గమనించే ఉంటారు. మీరు మీకు ఎప్పుడైనా ప్రశ్న రాలేదా… నిజానికి అలా ఎందుకుంటాయో అని అడిగితే జీన్స్ ధరించేవారిలో 10 శాతం మంది కూడా చెప్పలేరు. అలా వాటికి జేబులు పెడుతున్నారు అని రాలేదా… అలా వచ్చిన వాళ్లకే ఈ స్టోీరి.

జీన్స్‌లో చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయి?

నిజానికి… ఈ జీన్స్‌ ధరించడం 19వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. మొదట్లో శ్రామిక తరగతి ప్రజలు మాత్రమే జీన్స్ ధరించేవారు. వారి సౌలభ్యం కోసమనే తయారీసంస్థలు ఆ సమయంలో జీన్స్‌లో జేబుతో పాటు మినీ జేబు కూడా ఇచ్చేవి. పాత కాలంలో జీన్స్‌లోని చిన్న జేబును వాచ్ పాకెట్ అని పిలిచేవారు. అయితే కాలక్రమేణా దీనికి అనేక పేర్లు వచ్చాయి. ప్రజలు ఇప్పుడు దీనిని కాయిన్ పాకెట్, మేచ్ బాక్స్ పాకెట్, టికెట్ పాకెట్ అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు.
ఇక ఆ చిన్న జేబులోనే ఎందుకు వాచ్ లు పెడుతారో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

19వ శతాబ్దం లో చాలా వరకు శ్రామిక ప్రజలు ఉండేవాళ్లు. వారు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తు ఉంటారు. అంటే గ్లాస్ ఫ్యాక్టరీని, బొగ్గు ఫ్యాక్టరీ కానీ, ఉక్కు కర్మాగారాలు వంటి పరిశ్రమలలో పనిచేస్తున్న వాళ్లు… ఆ కాలంలో సమయం చూసుకునేందుకు రిస్ట్ వాచీలు లేవు. కేవలం పాకెట్ వాచీలు ఉండేవి. అందుకే జీన్స్ లో ఉండే జేబును “వాచ్ పాకెట్” అని పిలుస్తారు. కార్మికుడు పెద్ద జేబులో గడియారం పెట్టుకుంటే పనిచేసుకునేటప్పుడు తరచు విరిగిపోతున్నాయి. అయితే అలా కాకుండా చిన్న వాచిలను తయారు చేసి పెద్ద జేబులో కాకుండా చిన్న జేబులో పెట్టుకుంటే అవీ సెఫ్టిగా, ఉంటాయి. కిందపడిపోకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రత్యేకించి పాకెట్ గడియారాల కోసమే ఈ చిన్న జేబు ఏర్పాటు చేశారు. దీంతో జీన్స్ లో ఉన్న చిన్న జేబులు ఈ విధంగా పనికోచ్చేయి. ప్రస్తుతం ఇప్పుడెవరూ ఈ జేబును గడియారాలు పెట్టుకునేందుకు ఉపయోగించడం లేదు. బదులుగా అగ్గిపెట్టె, తాళం చెవి, కాయిన్స్, లెటర్స్ లాంటివి పడిపోకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ ఈ పాకెట్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ చిన్న జీన్స్ పాకెట్ అన్ని రకాల జీన్స్ ప్యాంట్లలో తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య కొన్ని జీన్స్ మోడల్స్ లో ఈ మినీ పాకెట్ జేబు పరిమాణం కూడా పెంచారు. ఇక ఇప్పుడు అర్ధం అయ్యిందా… మీరు వేసుకున్న ఈ జీన్స్ కి చిన్న జేబు ఎందుకు ఉందో అని.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *