- అమెరికాలో చైనా అధ్యక్షుడు కూతురు…?
- అగ్రరాజ్యం అమెరికాలో… డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్ పింగ్ కూతురికి ఏం పని..?
- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన కూతురిని రహస్యంగా ఉంచారా..?
- జిన్ పింగ్ కూతురు రహస్యంగా అమెరికాలో జీవిస్తుందా..?
- చైనా – అమెరికా ఉద్రిక్తతల సమయంలో… జిన్ పింగ్ కూతురి భవిష్యత్తు ఏంటి..?
- హార్వర్డ్ వర్సిటీ కి జిన్ పింగ్ కూతురు పరిమితం అయ్యిందా..?
- ట్రంప్ హయాంలో బాహ్యప్రపంచాన్ని జిన్ పింగ్ కూతురు చూడకపోవచ్చా..?
అగ్రరాజ్యం అమెరికాలో… డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్ పింగ్ కూతురు మింగ్జె రహస్యంగా జీవితం ను గడుపుతున్నట్లు తెలుస్తుంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో జిన్ పింగ్ కూతురు రహస్యంగా చదువుకుంటున్నట్లు సమాచారం. దీంతో చైనా ప్రభుత్వం జిన్ పింగ్ కూతురికి కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్యంగా నివసిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
Read Also : Aadhaar Update : మీ ఆధార్ అప్డేట్ చేయలేదా..? ఇదే చివరి అవకాశం.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..?
అమెరికా – చైనా

ప్రస్తుతం అమెరికా – చైనా ( America – China ) మధ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంనేంతగా రెండు దేశాలు ఉన్నాయి. ఎప్పుడు ఆ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందో ఎవరికీ తెలియదు. ఆర్థిక వృద్ధి లో రెండు అగ్రరాజ్యాలే… కానీ చివరికి మాత్రం ప్రపంచంపైనా ఆధిపత్యం చెలాయించేది అమెరికానే. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సైనిక వ్యవహారాలు, సాంకేతిక ఆధిపత్యం లాంటి కీలక రంగాల్లో ఈ రెండు దేశాలు ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు (Chinese President) జిన్ పింగ్ కూమార్తె జి మింగ్ (Xi Jinping) అమెరికాలో అత్యంత రహస్యంగా జీవిస్తోందనే వార్తలు తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) లో చదువుకున్న ఆమె నకిలీ పేరుతో మసాచుసెట్స్ ప్రాంతంలో అత్యంత భద్రత మధ్య రహస్యంగా జీవిస్తోందని అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అవును నిజంగా… చైనా (China) అధ్యక్షుడు కుమార్తె జి మింగ్ అగ్రరాజ్యం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటుంది. ఇక ఇటీవలే ట్రంప్ విద్యార్థులు వీసాల (Visa) విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి జిన్ పింగ్ కూమార్తె సంగతేంటి అని అలోచిస్తున్నారు.
Read Also : Reliance Jio : జియో యూజర్లకు 5 కొత్త ప్లాన్స్… ఇక పండగే పండుగ…!
వీసాలు రద్దు…

గత కొన్నేళ్లుగా విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా (America) లో చదువుకోవాలని భారత్ తో సహా… ఇతర దేశాలకు చెందిన చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ఎంతో కష్టపడి వీసాలు సంపాదించి లక్షల్లో ఫీజులు కట్టి అమెరికాలో వాలిపోతారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి విదేశీ విద్యార్థుల వీసాలను అక్కడి అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఆ నిబంధన విద్యార్థులందరికీ షాకివ్వడం మాత్రం ఖాయం. కాగా ఇదే నిభందన అందరికి వర్తిస్తుందా అనే అనుమానం కూడా రేకేత్తిస్తుంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్… భద్రతా కారణాల రీత్యా చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబినో ప్రకటించిన నేపథ్యంలో జిన్పింగ్ కూతురు నివాసం గురించి చర్చ మొదలైంది.
Read Also : Indian Economy : జపాన్ ను వెనక్కి నెట్టిన ఇండియా… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సత్తా..!
అమెరికాలో విద్యాభ్యాసం…

షీ మింగ్జె తన విద్యా ప్రస్థానాన్ని 2006 నుంచి 2008 వరకు హాంగ్జౌ ఫారిన్ లాంగ్వేజ్ స్కూల్లో ఫ్రెంచ్ అభ్యసించడంతో ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం జెజియాంగ్ విశ్వవిద్యాలయంలో కూడా చదివారు. చైనాలోని అనేక రాజకీయ ఉన్నత కుటుంబాల పిల్లల మాదిరిగానే, ఆమెను కూడా విదేశీ విద్య కోసం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివించడం కోసం సిద్ధం చేశారు. ఇది వారికి ఒక హోదా చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఆ తర్వాత జి.మింగ్ 2010లో హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) లో అడ్మిషన్ పొందింది. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తిచేసినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో ఆమె పేరు కూడా పూర్తిగా రహస్యంగా ఉంచబడింది. ఆమె చెంగ్ జి అనే నకిలీ పేరుతో చదువుకుందని రూమర్లు ఉన్నాయి. విద్య పూర్తయ్యాక, చైనాకు తిరిగిపోయిందా లేక అమెరికాలోనే ఉండిపోయిందా అన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. మింగ్జి ఉంటున్న ప్రాంతం, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చైనా అధికారులు ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి జిన్ పింగ్ కుమార్తె ఎక్కడ ఉందని స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది అనే దానిపై కచ్చితమైన సమాచారం కూడా లేదు. తాజాగా అమెరికాలో ఉన్న రైట్ వింగ్ , రాజకీయ కార్యకర్త లారా లూమర్ చేసిన వ్యాఖ్యలతో ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే, చైనా అధికారికంగా దీనిపై స్పందించలేదు. కానీ అమెరికాలో రాజకీయ దళాల మధ్య ఈ అంశం కీలకంగా మారింది.
Read Also : PM Modi : 1947 లోనే సర్దార్ మాట నెహ్రు వినుంటే.. ఇప్పుడు ఇంత జరిగేది కాదు
కెమెరా ముందుకు రాని… జిన్ పింగ్ ఫ్యామిలీ…కారణం
నిజానికి జిన్ పింగ్ కుటుంబ సభ్యుల జీవితం గురించి చాలా అరుదుగా వివరాలు బయటపడతాయి. అలాంటిది ఆయన కుమార్తె గురించి ఇలాంటి వివాదాస్పద వార్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తోన్నాయి. మింగ్జి ను కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆమె తండ్రి విధానాల గురించి ప్రశ్నిస్తానంటూ లూమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులు తమ దేశానికి చెందినవారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. లూమర్ వ్యాఖ్యలతో జి మింగి అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
Suresh