Srileela's engagement in secret...? Who is the groom..?

హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి.

వరుస సినిమాలతో బీజీ బీజీ…

టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ‌లీల‌ ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది కుర్ర హీరోయిన్. కాగా ఇటీవలే తను నటించిన ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోకపోవడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీలో అవకాశాలు త‌గ్గుతు వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే.. నార్త్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ .

Sreeleela engagement

తాజాగా ఈ అమ్మడు సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందని టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా శ్రీ లీల లంగా వోని వేసుకొని.. నగలు, కుంకుమతో ట్రెడిషనల్ లుక్ లో అచ్చతెలుగు ఆడపిల్లల ఆకట్టుకుంది. తాజాగా శ్రీలీల మరో అమ్మాయిని హగ్ చేసుకుని థిస్ ఇస్ బిగ్ డే అంటూ క్యాప్షన్ తో తాజాగా ఓ పిక్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకుంది. అయితే శ్రీలీల రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా.. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ లో ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు ఇది చదవండి. శ్రీలీల లంగా వోని వేసుకొని, నగలు, కుంకుమ పెట్టుకుని అచ్చ తెలుగు ఆడపిల్లలాగా రెడీ అవ్వడంతో పాటు మరో అమ్మాయిని హాగ్ చేసుకుని దిస్ ఈజ్ బిగ్ డే అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫోటో కింద బిగ్ డే అని క్యాప్షన్ పెట్టడంతో పాటు శ్రీలీల గెటప్ కూడా అచ్చం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలా కనిపించడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి శ్రీలీల రహస్యంగా ఎంగేజ్మెంట్ ఏమైనా చేసుకుందా.. ఈ పోస్ట్ అర్థం ఏంటి అని ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. అయితే శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోలేదని, శ్రీలీలకు ఇంకా పెళ్లి వయసు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ యువ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నసంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అమ్ముడు ఓ సినిమాలో మెరవనుంది. అయితే.. కార్తిక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల చట్టపట్టలేసుకుని తిరుగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి.

బాలీవుడ్ హీరోతోనే తన పెళ్లి జరుగుతుందా…?

ఇటీవలే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల మలు మార్లు కనిపంచడం, విరద్దరు కలిసి తిరగడం టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. దీంతో వీటికి ఊతం ఇచ్చేలా.. కార్తిక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి.. మరోసారి మెరిసింది ఈ యంగ్ బ్యూటీ. అంతేకాదు తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి ఓ ఈవెంట్లో సందడి చేసింది. ఇందులో భాగంగా మీకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్న ఎదురుగా.. మా ఇంటికి ఒక డాక్టర్ కోడలుగా వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక శ్రీలీల ఇప్పటికే ఎంబిబిఎస్ పూర్తి చేసి.. డాక్టర్ పట్టా పుచ్చుకోనున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీ‌లీలను ఉద్దేశించి కార్తిక్‌ ఆర్యన్ తల్లి ఇలాంటి కామెంట్స్ చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. తాజా జరిగిన ఈ వేడుకలు ఆమె ఎంగేజ్మెంట్ వే అని… అది కూడా శ్రీలీల తన బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొందరు తను ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోలేదని.. ఎవరి పెళ్లిలోను సందడి చేసి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

SURESH

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *