సాధారణంగా… పక్షులు అంటే మనందరికీ ఇష్టం. చాలా మంది పక్షి ప్రేమికులు ఉంటారు. చిలకలు, నెమలి, పావురాలు, హమింగ్ బర్డ్, హంసలు ఇలా చాలానే ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా మేకప్ వేసుకున్న పక్షిణి చేశారా..? అదేంటి ఇలాంటి పక్షి కూడా ఉంటుందా..? అదేమైనా మనిషా… మేకప్ వేసుకోవడానికి అంటారా.. అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? అలా మేకప్ వేసుకుని ఉండే పక్షి.. ఒక నిజంగా ఉండదు కానీ… సహజంగానే మేకప్ మాదిరి అందంగా, సహజ సౌందర్యం పొందిన ఓ పక్షి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చూడడానికి ఎంత అందంగా ఉన్నా… అంతకు భయంకరమైన డేగ జాతికి చెందిన పక్షి ఇది.

‘ది సెక్రటరీ బర్డ్... ఇది భయంకరమైన డేగల జాతికి చెందినప్పటికీ అందమైన రూపంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. చూడ్డానికి మేకప్ వేసుకున్నట్లుగా, ఐ ల్యాషెస్ పెట్టుకున్నట్లుగా కనిపించినా, ఇవి పూర్తిగా సహజమైనవి. ఇక ఈ పక్షి ఎక్కువ శాతం… భూమిపైనే ఉంటుంది. ఇ ఈ పక్షికి 1.3 మీ అంటే 4 అడుగుల 3 అంగుళాలు ఎత్తు ఉంటుంది. ఇక వీటి లింగాలు సైతం ఒకే విధంగా ఉంటాయి. ఇక ఈ పక్షికి ఎరుపు రంగు, నారింజ రంగు ముఖం, బూడిద రంగు ఈకలతో చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఇక ఈ పక్షి… ఎంతో ప్రమాదకరమైనా పాములు, క్షీరదాలను తిని జీవనం సాగిస్తుంది. ఈ జాతిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోతున్న జాతిలో చేర్చారు. ఇక ఈ పక్షి… సెక్రటరీబర్డ్ సుడాన్, దక్షిణాఫ్రికా దేశాల కనిపిస్తుంది.
SURESH