Do you know how many benefits there are if you eat dark chocolate?

చాక్లెట్… ఈ చిన్న పిల్లలో ఈ పేరు వింటే చాలా నోట్లో నీలురుతాయి. ఈ చాక్లెట్ ఇస్తామంటే ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతారు చిన్న పిల్లలు.. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇస్తాం అంటే ఎగిరి గంతేస్తారు. ఇంకా చెప్పాలంటే… చాక్లెట్ తో లవ్ లో పడని వారు అంటే ఉండరేమో. ఆఖరికి కుర్రాళ్లు సైతం లవ్ ప్రపోజల్ చేసే సమయంలో ఈ చాక్లెట్ తోనే ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తారు. ఇంకా కొంచం లవర్స్ అయితే… ఈ చాక్లెట్స్ తో లిప్ kiss’S’ సైతం పెట్టుకుంటారు. ఇక వయసుతో పని లేకుండా ఎవరైనా ఇష్టపడేది చాక్లెట్.. అందులో ఏ డౌట్ లేదు. అయితే తాజాగా ఈ చాక్లెట్ తో కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు సైతం ఉన్నాయటా. మరి ఆవేంటో ఇప్పుడు చూద్దాం రండి.

యూకే యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులు తాజాగా… చేపట్టిన ఒక అధ్య యనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డయాబెటికి, బీపీ ఉన్నవారికి, ఏజ్ ఎక్కువైనవారికి, వెయిట్ ఎక్కువున్నవారికి అవసరమైన చాక్లెట్ డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ మేలు తప్ప కీడు చేయదని చెబుతున్నారు. ఆఖరిని BP ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందంట. డార్క్ చాక్లెట్, ద్రాక్ష, యాపిల్, టీలను రోజూ తీసుకుంటే అధిక రక్త పోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురిత మైన ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు రక్తపో టును నియంత్రిస్తాయనీ, గుండె ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే రక్తనాళాల లోపలి సన్నని పొర ఎండోథీలియం పనితీరును మెరుగు పరుస్తాయనీ పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. కోకో, బ్లాక్ టీ, గ్రీన్ టీ, యాపిల్స్, బెర్రీలు, ద్రాక్షలు వంటి వాటిలో ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ ఆహార పదార్థాలను కొద్దిమొత్తంలో రోజువారీ ఆహా రంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలు వైద్యులు సూచించే మందులకు ప్రత్యా మ్నాయం కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు… గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులు లాంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించే మందులు వాడుకోవడంతో పాటు, సమ తులాహారం తీసుకుంటూ, శారీరకంగా చురుగ్గా ఉంటూ, ధూమ పానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి. ఇక మరిన్ని వీడియోస్ కోసం మన బీఆర్కే న్యూస్ ఛానల్ ను సబ్ క్కైబ్ చేయ్యండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. అంత వరకు చూస్తునే ఉండండి మన బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *