భారత్ పొరుగు దేశం చైనాలో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. చైనాలోని ఊహాన్ నగరంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వరదల ధాటికి ఉహాన్ నగరం అల్లకల్లోంగా మారింది. భారీ వరదలకు చైనాలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. ఊహాన్ తో పాట్ గాంగ్ డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ వంటి నగరాలు సైతం నీట మునిగాయి. తాజాగా సమాచారం ప్రకారం… కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం.
చెరువులను తలపిస్తున్న చైనా రోడ్లు…
భారీ వర్షాలకు చైనా లోని ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు నేలకూలాయి. వందలాది కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో లక్షలాది జనం రోడ్డున పడ్డారు. ఈ వరదల ధాటికి కోట్లల్లో నష్టం వాటిల్లింది. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చైనా ప్రభుత్వం ఊహాన్ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇదిలాఉండగా ఇటీవల అమెరికాను టోర్నడోలు వణికించాయి. మధ్య అమెరికా రాష్ట్రాల్లో కొన్నిరోజుల క్రితం నాలుగు టోర్నడోలు సంభవించాయి. వీటి ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఓక్లహామాలో అగ్నిమాపక కేంద్రంతో పాటు కనీసం 10 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది చీకట్లోనే ఇరుక్కుపోయారు. టోర్నడోల ధాటికి ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.