కవిత
కవిత

తెలంగాణలో కాక రేపుతున్న కవిత లేఖ.. కవిత సొంత కుంపటి తప్పదా..? తెలంగాణ రాజకీయాల్లో కవిత సంచలన ప్రకటన చేయబోతుందా…? అందరూ అన్నట్లుంగానే కల్వకుంట్ల ఇంట్లో వివాదాలు మొదలయ్యాయా..? i love you డాడీ అంటునే… లేఖతో కవిత తుట్లుపొడిచిందా..? కవిత లేఖ వెనుక ఆంతర్యం ఏంటి..? బీజేపీపై కవిత పగ తీర్చుకోమని కేసీఆర్ కి చెప్తుందా..? నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టనుందా..? జన జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా..? తెలంగాణ రాజకీయాల్లో కవిత భవిష్యత్తు ఏంటి..?

గత కొంత కాలంగా… బీఆర్ఎస్ పార్టీలో కవిత కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బెయిల్ పై విడుదలైన కవిత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వంపై కాస్త ఫైర్ అయినప్పటికి, బీజేపీ పై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత కొంత కాలంగా… బీఆర్ఎస్ పార్టీలో కవిత అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మా కుటుంబంలో అలాంటి ఏం లేవు అని కేటీఆర్, హరీష్ రావులు చెప్తున్నా, కవిత మాత్రం ఇప్పటి వరకు బహిరంగ చెప్పిన దాకాలాలు అయితే లేవు. తాజాగా కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో, బీఆర్ఎస్ పార్టీలో కాకా రేపుతోంది.

కాక రేపుతున్న కవిత లేఖ

  • తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. జైలు నుంచి విడుదలైయినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న కవిత… సొంత పార్టీపైనే బంబు పెల్చింది. కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నోర్ల ఎల్లబెట్టారు. అసలు సొంత పార్టీలో ఏం జరుగుంది అని పార్టీ సీనియర్ నేతలకు సైతం మింగుడు పడటం లేదు. తాజాగా… పార్టీలో జరుగుతున్న పరిణామాలపై “మైడియర్ డాడీ” అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్ కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు కవిత.

అస‌లు క‌విత సొంత పార్టీపై ఎందుకు తిరుగుబాటు చేశారు..?

  • క‌న్న తండ్రినే ప్ర‌శ్నిస్తూ ఎందుకు లేఖాస్త్రం సంధించింది? పార్టీ అధినేత‌కు ర‌హ‌స్యంగా రాసిన లేఖ బ‌య‌ట‌కెలా వ‌చ్చింది..? లేదా కావాల‌నే ఆ లేఖను లీక్ చేశారా..? క‌విత‌ను పొమ్మ‌న లేక పొగ పెట్టబోతున్నారా..? లేక పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆమె ఆవేద‌నను ఈ లేఖ ద్వారా చెప్పకే చెప్పారా..? లేక సొంత కుంప‌టి పెట్టుకోవ‌డానికే తిరుగుబావుటా ఎగురువేస్తున్నట్లు ప్రత్యేక్షంగా ప్రకటించిందా..? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అందరి మదిలో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి.

కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత వ్యవహార శైలి

  • ప్రస్తుతం కేసీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్నట్లు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వార స్పష్టమైంది. ఎవరైనా ఇంట గెలిచి, రచ్చ గెలవాలి అని అంటూంటారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో ఒడిపోయి, రచ్చ గెలిచినట్లు ఉంది ప్రస్తుతం వ్యావహారం, అవును. నిజంగా… కేసీఆర్ కు ప్రస్తుతం కవిత వ్యవహారం శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పని గట్టుకోని మరి కవిత, అధికార పార్టీకి, రాజకీయా ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాని ఇచ్చినట్లు అయ్యింది. సొంత పార్టీ వ్య‌వ‌హార శైలిపై, క‌న్న తండ్రి తీరుపై ఆమె సంధించిన‌ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇదంతా… వరంగల్ సభతోనే తన కుటుంబంలో చీలిక వచ్చిందా అన్న అనుమానలకు తావు తీస్తుంది.

జన జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా..?

  • ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కవితకు సైతం ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాగృతి సంఘంతో కవిత ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చెప్పటింది. అలా పలుమార్లు మంచి ఫలితాలు సైతం అందుకుంది. దీంతో కవితకు సైతం పార్టీ నడిపించేందుకు సత్తా ఉందని తన కవిత వర్గ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారడం గానీ లేదంటే కొత్త పార్టీ పెట్టడం గానీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ పెడితే… కచ్చితంగా తెలంగాణ పేరు వచ్చే విధంగా గానీ, లేదంటే తెలంగాణ ఆనవాళ్ళు ఉండేటట్లు చూసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక ఇప్పటికే కవితకు తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా జాగృతితో తెలంగాణ కళలు, సంస్కృతి కార్యక్రమాలు చేపట్టి యువతలో ప్రేరణ నింపింది. దీంతో కవితకు సొంతంగా జాన జాగృతి పేరుతో పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా రేపు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందా అనేది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *