Hyderabad : దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. రంగురంగుల దీపాలు, మిఠాయిలతో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు దేశ ప్రజలు. చిన్నా పెద్దా తేడా లేకుండా, మిఠాయిలు పంచుకుంటు, బాణసంచా కాలుస్తూ ఆనందం పండుగ జరుపుకున్నారు. ఒక వైపు దేశ ప్రజలు, మరో పక్క పాకిస్థాన్ సరిహద్దుల్లో (Pakistan border) భారత సైనికులు (Indian soldiers) గ్రామస్థులు, పిల్లలతో కలిసి దీపావళి జరుపుకొన్నారు. ఇక దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక భవనాలకు విద్యుత్ దీపాలంకారణతో అలకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల నరకాసురుడి దహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా దీపావళి వేడుకలు జరుపుకోని దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పారు.
రోగులతో కిక్కిరిసిన సరోజినీ ఆసుపత్రి..
ఇక తాజగా.. తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ లో (Hyderabad) దీపావళి పండుగ వేళ నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి గాయాలపాలయ్యారు. దీంతో మెహదీపట్నంలోని (Mehdipatnam) సరోజినీదేవి కంటి ఆసుపత్రికి (Sarojini Devi Eye Hospital) గాయపడిన వారు చికిత్స కోసం పదుల సంఖ్యలో తరలివచ్చారు. దీపావళి పండగ సందట్లో నగర వ్యాప్తంగా అక్కడక్కడ అడపాదడపా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో హైదరాబాద్ సరోజినీ ఆస్పత్రికి బాణసంచా బాధితులు క్యూ కడుతున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో క్రాకర్స్ కాలుస్తూ ఏకంగా 70 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. 12 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

70 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం..
దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా బాధితులతో సరోజినీదేవి కంటి ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది. ఆస్పత్రి RMO డాక్టర్ ఇబ్రహీం (Dr. Ibrahim) తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రతి ఏడాది దీపావళి సమయంలో అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. నగర వ్యాప్తంగా టపాసులు కాలుస్తూ గాయపడేవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతునే పోతుంది. దీంతో యేటా దీపావళి ముగిసిన తెల్లారే హైదరాబాద్ సరోజినీ ఆసుపత్రికి బాధితులు వరుస కడుతుంటారు. రాత్రి నుండి ఇప్పటి వరకు 70 గాయపడి.. ప్రధమ చికిత్సగా 47 మందికి అందించారు. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. టపాసులు చేతిలో పేలడం వల్ల కళ్లలో, ముక్కలో పడడం వంటి ఘటనలు సంభవించాయి. గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. గాయాలయిన వారిలో ఎవ్వరికి శస్త్రచికిత్సలు అవకారం లేదన్నారు. అలాగే ఇంకా కేసులు వచ్చినా చికిత్స చేయడానికి పూర్తి సన్నాహాలు చేశామని డాక్టర్ తెలిపారు.

బహదూర్ పురా లో అగ్ని ప్రమాదం..!
ఇక మరో వైపు.. పాతబస్తీలోని (old town) బహుదూర్‌పురా (Bahudurpura) చౌరస్తాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోడౌన్ (Scrap godown) నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాణసంచా కాలుస్తుండగా నిప్పు రవ్వ పడి స్క్రాప్ దుకాణం తగలబడ్డింది. సమయానికి ఫైర్ సిబ్బంది మంటలార్పడంతో ప్రాణనష్టం తప్పింది. మరోవైపు హైదరాబాద్ మంగళహాట్‌లోనూ (Mangalahat) భారీ అగ్నిప్రమాదం (fire incident) జరిగింది. టపాసులు పేలడంతో గ్యారేజ్‌లోని వాహనాలు దగ్ధమైనాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసింది.
