- KPHB కోట్లల్లో పలుకుతున్న ఎకరం భూమి..
- KPHB లో ఎకరం 70 కోట్లతో సరి కొత్త రికార్డు..
- ఎకరం రూ. 70 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రెజ్ ప్రాపర్టీస్
- మూడు గంటల పాటు సాగిన హోరాహోరీ వేలం పాట
- హోరా హోరీలో.. గోద్రెజ్ ప్రాపర్టీస్ సరి కొత్త రికార్డు..
- ఈ-వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ. 547 కోట్ల భారీ ఆదాయం
- పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ నిధుల వినియోగం
- రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకంతో మరో రూ. 70 కోట్లు
KPHB ఈ పదంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన ఎరియా. ఇప్పుడు మరో కొత్త వార్తతో.. KPHB పేరు మారుమ్రోగిపోతుంది. ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..?
రియల్ ఎస్టేట్ మార్కెట్ KPHB కొత్త రికార్డు..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో (Hyderabad real estate market) మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ. 70 కోట్లు పలికింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బుధవారం నిర్వహించిన ఈ-వేలంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. ప్రస్తుతం KPHB.. అనే ఏరియా తెలియని వారు ఉండరేమో. ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్న భూములు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎందుకంటారా..? KPHB ఎకరం దాదాపు 70 కోట్ల చొప్పున గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ (Godrej Properties Company) దక్కించుకుంది. దీంతో ఒక్క సారిగా.. KPHB పేరు మరో సారి మారుమ్రోగిపోయింది. నిజానికి KPHB లో 7.8 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు హౌసింగ్ బోర్డ్ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ 7.8 ఎకరాలను కొనుగోలు చేసేందుకు 4 ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. గోద్రెజ్‌తో పాటు అరోబిందో రియాల్టీ (Aurobindo Realty), ప్రెస్టీజ్ ఎస్టేట్స్ (Prestige Estates), అశోకా బిల్డర్స్ (Ashoka Builders)వంటి దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. సుమారు మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ-వేలంలో బిడ్ ధర 46 సార్లు పెరిగింది. పోచారం, గాజులరామారం టౌన్‌షిప్‌లలో అసంపూర్తిగా ఉన్న మూడు టవర్లను విక్రయించడం ద్వారా కార్పొరేషన్‌కు రూ. 70.11 కోట్ల ఆదాయం చేకూరింది. కానీ ఆ మూడు కంపెనీల కంటే.. అధికంగా వేలం వేసి దాదాపు రూ. 547 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా.. రియల్ ఎస్టేట్ రంగంలో (Real estate sector) KPHB రికార్డును నెలకొల్పింది.
ఆ డబ్బులు దానికే ఖర్చు..
ఈ భూమి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, మరోవైపు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా తన ఆస్తులను విక్రయించింది.