నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నేపాల్ విధించిన రూల్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు పాటించలేదని ఇలా చేసింది.
ఇక విషయంలోకి వెళ్తే..
భారత్ దాయాయి దేశం నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ X (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయా సోషల్ మీడియా సంస్థలు నేపాల్ ప్రభుత్వం విధించిన నిబంధనలకు పాటించకపోవడమే ఈ నిషేధానికి కారణమని అధికారులు తెలిపారు. నేపాల్ ప్రభుత్వం ‘సోషల్ నెట్‌వర్క్‌ల వినియోగ నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు, 2023’ ప్రకారం దేశంలో పనిచేసే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నమోదు చేసుకోవాలని, ప్రతినిధులను నియమించాలని నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించడం, అవాంఛనీయమైన, ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించడం, సైబర్ నేరాలను అరికట్టడానికి పెట్టారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్ (యూట్యూబ్) వంటి ప్రముఖ సంస్థలు ఈ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయి. దీంతో, నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఇక నేపాల్ ప్రభుత్వం అనేక సార్లు గడువు పొడిగించినప్పటికీ, పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను నమోదు చేసుకోవడానికి ముందుకు రాలేదు. నేపాల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, టిక్‌టాక్, వైబర్ వంటి కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి నమోదు చేసుకున్నాయి. మిగిలిన వాటి నిర్లక్ష్యం కారణంగానే నిషేధం అనివార్యమైంది. ఈ నిర్ణయంతో నేపాల్ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే చిన్న వ్యాపారులు, తమ ఆదాయం కోసం డిజిటల్ కంటెంట్‌పై ఆధారపడిన యువతకు ఇది పెద్ద దెబ్బ కొడుతుంది. ఈ చర్య వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో టిక్‌టాక్‌పై విధించిన నిషేధం వల్ల కలిగిన నష్టాలను ఉదాహరణగా చూపుతూ, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనశైలికి హానికరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ నిషేధం కేవలం నియంత్రణ సమస్య కాకుండా, ప్రజల ప్రాథమిక హక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా ఈ వ్యతిరేకతపై నేపాల్ యువత భగ్గుమంది.
నేపాల్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై యువత రోడ్డెక్కింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తో (ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్) పాటు మొత్తం 26 యాప్స్ ను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరించాలని, దేశంలో రాజ్యమేలుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత సోమవారం దేశ రాజధాని కాఠ్మండులో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే 9 మంది మృతి చెందగా.. 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గత వారం, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోగా నమోదు చేసుకోనందున ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి అనేక సోషల్ మీడియా సైట్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుంచి, సామాన్య నేపాలీల కష్టాలను, రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన వస్తువులు, విదేశీ విహారయాత్రలు చేస్తున్న తీరును పోల్చిచూపే వీడియోలు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్నాయి. టిక్‌టాక్ ప్రస్తుతం పనిచేస్తుండటంతో, ఇది యువతకు తమ నిరసనను వ్యక్తం చేసే వేదికగా మారింది.