23-year-old Telugu woman goes into space

అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గురించే మనకు తెలుసు. కానీ వాళ్లతో పాటు మన తె లుగు రాష్ట్రాల నుంచి ఇది వరకు ఓ వ్యోమగామి వెళ్లిన విషయం తెలుసా… ఆమె కాదు ఇప్పుడు మరో అమ్మాయి వెళ్తుందాని తెలుసా..?

గతంలో ఆంధ్రప్రదేశ్ సంతతికి చెందిన బండ్ల శిరీష అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోకి వెల్లి వచ్చిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మూడో మహిళా వ్యోమగామిగా (astronauts) బండ్ల శిరీష చరిత్ర కెక్కింది. కాగా ఇప్పుడు మరో మహిళ అంతరిక్షంలోకి వెళ్లబోతుంది.

చిన్ననాటి కల..

చిన్నతనంలో కన్న కలలను సాధ్యం చేసుకోబోతుంది ఓ తెలుగు యువతి. ఆంధ్రాలో పుట్టిన ఆ యువతి అమ్మమ్మ చెప్పే చందమామ కధలను వింటూ అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంది. ఇప్పుడు వాటిని నెరవేర్చుకుంటుంది. ఇంతకీ ఎవరీ ఆ తెలుగు యువతి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రండి

పాలకొల్లు నుంచి ప్రపంచస్థాయికి..

అవును.. నిజంగా మరో యువతి అంతరీక్షంలోకి వెళ్తుంది. అది ఏ దేశం యువతో కాదు మన భారత దేశం యువతే. అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు కు చెందిన యువతి అంతరిక్షంలోకి వెల్లబోతుంది. భారతీయ మహిళలు (Indian women) అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. మహిళలకు ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అన్న నినాదానికి మడుగున పడేస్తు భారతీయ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇక అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయిలు వెళ్తారు అంటే.. కొన్ని ఏళ్ల కిందట నవ్వరు. కాని అలాంటి అసాధ్యాన్ని మన 0తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి (West Godavari)జిల్లా పాలకొల్లుకు దిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. (Dangeti Jahnavi) అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించే స్పేస్‌ మిషన్‌ కోసం సెలక్ట్ అయ్యింది. భారత్‌ నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఇక స్పేస్ మిషన్ (Space Mission) నుంచి దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు (space travel) సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.

టైటాన్ స్పేస్ నుంచి పరీక్ష విజయం..

అంతరిక్షంలోకి వెళ్లడానికి టైటాన్‌ స్పేస్‌ (Titan Space) ప్రతినిధులు నిర్వహించిన పరీక్షల్లో జాహ్నవి విజయం సాధించి స్పేస్‌ మిషన్‌కు అర్హత సాధించింది. జీరో గ్రావిటీ ట్రైనింగ్, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి కీలక అంశాల్లో శిక్షణ పొందారు. అంతేకాదు, 16 దేశాల యువతతో కూడిన అంతర్జాతీయ బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించి లీడర్‌షిప్‌ నైపుణ్యాన్ని చాటారు. ఇక ఈ టైటాన్‌ స్పేస్‌ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. అంతరిక్షంలో వాణిజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగానే కొందరు అంతరిక్షంలోకి పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను తీసుకెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో ఇండియా నుంచి జాహ్నవి వెళ్లనుంది. ఈ యాత్రలో ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది. ఇక ఈ అంతరిక్షయానానికి ఎంపికైన అభ్యర్థులకు 2026 నుండి మూడు సంవత్సరాల పాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్‌లో భాగంగా తీవ్రమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నారు. ఇందులో ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు వంటి విభాగాల్లో శిక్షణ ఉంటుంది. 2029లో ఐదు గంటలపాటు జరిగే ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా మానవ అంతరిక్ష పరిశోధనలో ఓ కొత్త అధ్యాయానికి ఆమె శ్రీకారం చేపట్టనున్నారు. ఇక ఇప్పటికే… అడ్వాన్స్‌డ్ లెవెల్ స్కూబా డైవింగ్ శిక్షణను పూర్తి చేసి, నీటి లోతుల్లో గ్రావిటీ లేని వాతావరణంలో పనిచేయగల సామర్థ్యాని కూడా జాహ్నవి సంపాదించారు.

కరాటే కళ నుండి ఖగోళ లోకి అడుగు

జాహ్నవి ఖగోళంలోనే కాదు… జాతీయ కరాటేలో .. అంతర్జాతీయ మెడల్స్ (International Medals) సాధించింది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ లాంటి రంగాల్లోనూ శిక్షణ పొంది అద్భుత ప్రతిభను చాటారు. భారతదేశం తరపున అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మరో మేటి యువతి జాహ్నవి దంగేటి దేశానికి గర్వకారణం అనే చెప్పాలి. ఇక రాబోయే యువత,యువతిలు జాహ్నవి ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఉంది. ఇక జాహ్నవి.. తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగాలలో ఉండగా, జాహ్నవి విజయాల వెనుక ఆమె అమ్మమ్మ లీలావతి ప్రధాన శక్తిగా నిలిచారు. చిన్నప్పటి నుండి చందమామ కథలు వింటూ పెరిగిన జాహ్నవి, అంతరిక్షం పట్ల తన కలలను పెంచుకుంది. అప్పటి నుంచి తనకు అంతరిక్షంలోకి వెళ్లాలనే కోరిక ఉండేదట. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతోంది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *