దేశంలో పెరిగిపోతున్న సెక్స్ బాబాలు..
బాబాలు.. మన దేశంలో బాబాలకు ఇచ్చిన మర్యాద, సైంటిస్టులకు ఇచ్చి ఉంటే.. మన దేశం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిన భారత దేశం మాత్రం ఈ బాబాల చేతిలో నలిగిపోతున్నారు. తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుంది. బాబాల పక్కలో పడుకుంటే.. తల రాతే మారిపోతుంది. నిజంగా ఇది మూఢనమ్మకం, అంధ విశ్వాసం. గుడ్డిగా నమ్మి.. తమ జీవితాలను, మన ప్రాణాలను బురిడి బాబాల చేతిలో పెట్టేస్తున్నాం. ఇలా ఉంటే.. మన రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు. దొంగ బాబాల పలుకుబడిని, జనంలో అంధ విశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. మన మూఢ రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు? అదే మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది.

ఇక విషయంలోకి వెళ్తే..
ప్రస్తుతం దేశంలో ఢిల్లీ బాబా గురించే హాట్ టాపిగా మారింది. బాబా ముసుగులో చైతన్యానంద చేసిన లీలలు బయటపడుతుండటంతో పోలీసులే అవాక్కవుతున్నారు. అరెస్ట్ తరవాత ఢిల్లీలోని ఆయన గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సెక్స్ టాయ్స్, పోర్న్ సీడీలను గుర్తించారు. బాబా నివాసంలో రెండవసారి సోదాలు నిర్వహించగా.. పోలీసులు ఒక సెక్స్ టాయ్, ఐదు అశ్లీల వీడియో సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ల తో బాబా చైతన్యానంద సరస్వతి నకిలీ ఫొటోలు కనుగొన్నారు. అంతేకాదు.. అనేక నేరారోపణ పదార్థాలను సైతం కనుగొన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా గోడలపై ప్రధాని మోడీల ఫోటోలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ రోత బాబా శ్రీ శారదా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 17 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపడమే కాకుండా పాస్ చేయాలంటే తనతో గడపాలని లేదంటే కాలేజీ నుండి బయటకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ యువతి మొదట ఫిర్యాదు చేయగా తరవాత మరికొందరు చైతన్యానంద వేధింపులపై ఫిర్యాదు చేశారు. వారంతా ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాబాను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయిలకు పెట్టిన సందేశాలను సైతం గుర్తించారు. మరోవైపు దుబాయ్ షేక్ కు అమ్మాయి కావాలంటూ ఓ విద్యార్థినికి సందేశాలు పంపినట్టు అతడి చాటింగ్ లో ఉంది. దీంతో బాబా నెట్ వర్క్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో అమ్మాయిలను సప్లై చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
3:30 గంటలకు అరెస్ట్..
దీంతో పోలీసులు.. చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థ సారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.
120 మహిళలపై అత్యాచారం..

ఇక గతంలో కూడా ఆధ్యాత్మిక ముసుగులో దాదాపు 120 మహిళలపై అకృత్యాలకు పాల్పడిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌పురి (బిల్లు)కి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యాణాలో సంచలనం రేపిన ఈ కేసులో నిందితుడికి ఎట్టకేలకు శిక్ష పడింది. తానని తాను మహిమలున్న బాబాగా పరిచయం చేసుకుని తాంత్రిత విద్యల పేరిట తన వద్దకు వచ్చిన మహిళలకు మత్తుమందు ఇచ్చి.. ఆపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అనంతరం వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేవాడు. అంతటితో ఆగకుండా తనతో సంబంధం పెట్టుకోవాలని పదేపదే వేధించేవాడు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో జిలేబీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఈ కేసును విచారించిన ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడిని దోషిగా తేల్చి, శిక్షతో పాటు రూ.35 వేలు జరిమానా విధించింది. ఇలా ఎంత మంది బాబాలను అరెస్ట్ చేసి జైలుకు పంపిన.. మళ్లీ అలాంటి బాబాలు పుట్టుకోస్తునే ఉన్నారు.